
SFI : దేవరకొండ డివిజన్ ఆగష్టు 06, త్రినేత్రం న్యూస్. దేవరకొండ :విద్యార్థులకు పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని హైదరాబాద్,ఇందిరా పార్క్ నిర్వహించిన విద్యార్థుల మహా ధర్నా కార్యక్రమానికి ఎస్ఎఫ్ఐ దేవరకొండ డివిజన్ నాయకత్వం తరలి వెళ్లడం జరిగింది.
ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ దేవరకొండ డివిజన్ కార్యదర్శి బుడిగ వెంకటేష్ మాట్లాడుతూ… ఆర్థిక ఇబ్బందుల కారణంగా వేలాది మంది విద్యార్థులు చదువును కొనసాగించడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తక్షణ పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ ప్లీజ్ రియంబర్స్మెంట్ విడుదల చేసి విద్యార్థులను ఆదుకోవాలని అన్నారు.అదేవిధంగా ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాలని, ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని,ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని, విద్యార్థులకు నాణ్యమైన విద్య అందేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
కళాశాలలో చదువుకునేటువంటి విద్యార్థిని,విద్యార్థులకు మధ్యాహ్న భోజన వసతి కల్పించి పేద బడుగు బలహీన వర్గ విద్యార్థులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు సభవాత్ వినోద్, నేతళ్ళ జైరాం,కే.మహేష్,ఏ.శివ, పరమేష్,పులిజాల శివ, కే.చరణ్,ఏ. రామ్మోహన్,నర్సింహా,చలపతి, అశ్వంత్,తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe