ఆగస్ట్ 6, 2026
TRINETHRAM NEWS
Boddupalli Krishna

ప్రభుత్వ ఉద్యోగాల పరీక్ష ఫీజుల పేరుతో నిరుద్యోగులపై కాంగ్రెస్ ప్రభుత్వం భారం మోపుతోంది
బిఆర్ఎస్వీ దేవరకొండ నియోజకవర్గ అధ్యక్షులు బొడ్డుపల్లి కృష్ణ

Boddupalli Krishna : దేవరకొండ డివిజన్ ఆగష్టు 05, త్రినేత్రం న్యూస్. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలకు ఎలాంటి పరీక్ష ఫీజులు వసూలు చేయబోమని హామీ ఇచ్చిందని, కానీ ప్రస్తుతం ఆ హామీని విస్మరించి ఎస్సై పోస్టుకు రూ.1,500, కానిస్టేబుల్ పోస్టుకు రూ.1,000 చొప్పున పరీక్ష ఫీజులు వసూలు చేస్తోందని బిఆర్ఎస్వీ దేవరకొండ నియోజకవర్గ అధ్యక్షులు బొడ్డుపల్లి కృష్ణ విమర్శించారు.
రాష్ట్రంలో ఇప్పటికే నిరుద్యోగ యువత ఉపాధి అవకాశాల కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో, ఇలాంటి భారీ పరీక్ష ఫీజులు విధించడం వారికి అదనపు ఆర్థిక భారం మోపడమేనని అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ విద్యార్థులు, నిరుద్యోగులతో కాంగ్రెస్ ప్రభుత్వం వ్యాపారం చేస్తున్నట్లు కనిపిస్తోందని ఆయన ఆరోపించారు.
ప్రభుత్వం వెంటనే పరీక్ష ఫీజులను రద్దు చేయాలని లేదా గణనీయంగా తగ్గించాలని, ఎన్నికల హామీలను అమలు చేసి నిరుద్యోగ యువతకు న్యాయం చేయాలని బొడ్డుపల్లి కృష్ణ డిమాండ్ చేశారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page