జూలై 23, 2026
TRINETHRAM NEWS
MLA Balu Naik

SIR విధానంపై బీఎల్వోలు, బీఎల్ఏలకు అవగాహన

దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ .

MLA Balu Naik : కొండ మల్లేపల్లి -జులై 22, త్రినేత్రం న్యూస్. కొండమల్లేపల్లి పట్టణంలో నిర్వహించిన సమావేశంలో SIR (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) విధానంపై అన్ని బూత్‌ల బీఎల్వోలు (BLOలు), బీఎల్ఏలు (BLAలు) మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులకు దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ సమగ్ర అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాలు నాయక్ మాట్లాడుతూ, అర్హత కలిగిన ప్రతి ఒక్కరి ఓటు హక్కును పరిరక్షించడం ప్రతి బీఎల్ఓ, బీఎల్ఏ మరియు కాంగ్రెస్ పార్టీ నాయకుడి బాధ్యత అని పేర్కొన్నారు. అర్హత కలిగిన ఒక్క ఓటరు పేరు కూడా ఓటరు జాబితా నుంచి తొలగిపోకుండా అప్రమత్తంగా పనిచేయాలని సూచించారు.

ఓటు ప్రజాస్వామ్యంలో అత్యంత విలువైన హక్కు అని, ప్రతి పౌరుడు తన ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం ఉండేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే తెలిపారు. ప్రజలకు SIR విధానంపై పూర్తి అవగాహన కల్పించి, అవసరమైన పత్రాలు సక్రమంగా సమర్పించేలా సహకరించాలని బీఎల్ఏలు, పార్టీ నాయకులకు సూచించారు.
ఈకార్యక్రమంలో దేవరకొండ వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మెన్ నాయిని జమున-మాధవరెడ్డి, PACS ఛైర్మెన్ దూదిపాల వేణుధర్ రెడ్డి, మండల అధ్యక్షుడు కాసర్ల వెంకటేశ్వర్లు, మాజీ మండల అధ్యక్షుడు ఊట్కూరి వేమన్ రెడ్డి, సర్పంచ్ పసునూరి యుగేందర్ రెడ్డి, SIR నియోజకవర్గ కోఆర్డినేటర్ కొర్ర రాంసింగ్ నాయక్, సంబందిత అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, బీఎల్వోలు, బీఎల్ఏలు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page