ఆగస్ట్ 15, 2026
TRINETHRAM NEWS
Door-to-Door Voter Registration
  • సిమర్ల శ్రీను యాదవ్
  • బిఆర్ఎస్ యువజన నాయకులు

Door-to-Door Voter Registration : చింత పల్లి జులై 17,త్రినేత్రం న్యూస్. చింతపల్లి మండలంలోని తీదేడు గ్రామంలో ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న SIR ( స్పెషల్ ఇంటన్సివ్ రివిజన్ ) కార్యక్రమంలో భాగంగా బూత్ లెవల్ అధికారులతో కలిసి ఇంటింటికి వెళ్లి ఓటర్ల వివరాల నమోదు కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ యువజన నాయకులు సిమర్ల శ్రీను యాదవ్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా గ్రామ ప్రజలకు ఎస్ ఐ ఆర్ నమోదు ప్రాముఖ్యతను వివరించి,అర్హులైన ప్రతి ఒక్కరూ తమ వివరాలను సకాలంలో నమోదు చేసుకోవాలని సూచించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఎంతో విలువైనదని, గ్రామ ప్రజలు ఎలాంటి నిర్లక్ష్యం చేయకుండా (SIR) ,ఎస్ ఐ ఆర్ ప్రక్రియలో పాల్గొని తమ వివరాలను నమోదు చేసుకోవాలని కోరారు. ఎన్నికల అధికారులకు అవసరమైన సహకారం అందించాలని గ్రామస్తులను విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో తీదేడు గ్రామ పాలన అధికారి బుషిపాక యాదయ్య,బి.ఎల్.ఓ అంజమ్మ, చింతకుంట్ల రాకేష్ తదితరులున్నారు.

You cannot copy content of this page