జూలై 23, 2026
TRINETHRAM NEWS
MLA Jare Adinarayana

MLA Jare : త్రినేత్రం న్యూస్, అశ్వారావుపేట మండలం. 22-07-2026-బుధవారం.. అశ్వారావుపేట నియోజకవర్గ, ఎమ్మెల్యే జారే ఆదినారాయణ.అశ్వారావుపేట లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ పరిధిలోని వున్న అన్ని శాఖల అధికారులతో,సమగ్ర సమీక్షా సమావేశం నిర్వహించారు. నియోజకవర్గంలో కొనసాగుతున్న పలు అభివృద్ధి పనుల ప్రస్తుత పరిస్థితి పై శాఖల వారీగా,అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.

ప్రభుత్వ సంక్షేమ పథకాలు, మరియు అభివృద్ధి ఫలాలు ప్రజలకు సత్వరమే అందేలా అన్ని శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పని చేయాలని సూచించారు. క్షేత్రస్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను గుర్తించి, వాటికి త్వరితగతిన శాశ్వత పరిష్కారం చూపాలని సంబంధిత అధికారులకు దిశా నిర్దేశం చేశారు.ఈ కార్యక్రమం లో అశ్వారావుపేట మున్సిపాలిటీ వైస్ చైర్మన్ జూపల్లి రమేష్ బాబు మరియు అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page