
Fake Police Officer : తిరుపతి జిల్లా : త్రినేత్రం న్యూస్ : జూలై 19; తిరుపతి అలిపిరి పోలీస్ స్టేషన్ పరిధిలో విహా హోమ్ స్టే మేనేజర్ ను నకిలీ పోలీస్ ( ఆర్ ఎస్ ఐ). బెదిరించాడు. ఓ మహిళతో హోం స్టే కి చేరుకొని తాను పోలీస్ అంటూ ఫ్రెష్ అప్ అవ్వడానికి రూమ్ కావాలని డిమాండ్ చేశాడు. తెల్లవారుజామున మూడు గంటల నుండి ఏడుగంటల వరకు రూమ్ లోనే ఇరువురు ఉండడం జరిగింది.
తలుపు తట్టినా రూము తలుపులు తీయకపోవడంతో అనుమానంవచ్చి హోమ్ స్టే యజమానికి, పోలీసులకు సమాచారం మేనేజర్ హేమంత్ తెలిపారు. అక్కడకు చేరుకుని పోలీసులు నకిలీ పోలీసుగా గుర్తించి పోలీస్ స్టేషన్ తరలించారు. పట్టుబడ్డ నకిలీ పోలీస్ ది గుంటూరు జిల్లా, చోడయపాలెం కు చెందిన దాసరి కార్తీక్ అని గుర్తించారు.
హోమ్ స్టే యజమాని పార్థసారధి రెడ్డి అలిపిరి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అయితే కేసు నమోదు చేసి అలిపిరిఎస్ఐ రామాంజనేయులు విచారిస్తున్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe