
Etela Rajender : త్రినేత్రం న్యూస్ : తెలంగాణ : మేడిగడ్డలో నీటిని నిల్వ చేయకుండా నదిలో వృథాగా పోతున్న నీటిని ఎత్తిపోసే చర్యలు చేపట్టాలని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. రాజకీయాల కోసం తెలంగాణ ప్రజల ప్రయోజనాలకు నష్టం కలిగిస్తే ప్రశ్నిస్తానని హెచ్చరించారు.
తాను ఏ పార్టీని విమర్శించేందుకు రాలేదని, బాధ్యత గల పాలకులను మాత్రమే ప్రశ్నిస్తున్నానని మీడియా సమావేశంలో స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని నీటి నిర్వహణపై ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని ఈటల సూచించారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe