ఆగస్ట్ 6, 2026
TRINETHRAM NEWS
Special POCSO

Special POCSO : త్రినేత్రం న్యూస్ : తిరుపతి జిల్లా : వడమాలపేటలో మూడున్నరేళ్ల చిన్నారిపై అత్యాచారం, హత్య కేసులో ప్రత్యేక పోక్సో కోర్టు సంచలన తీర్పు… నిందితుడు పాముల నాగరాజు అలియాస్ సుశాంత్‌కు యావజ్జీవ కారాగార శిక్ష… అత్యాచారం కేసులో జీవితాంతం కఠిన కారాగార శిక్ష విధింపు… హత్య కేసులోనూ మరో జీవితాంతం కఠిన కారాగార శిక్ష విధింపు, రెండు శిక్షలు ఏకకాలంలో అమలవుతాయని కోర్టు ఆదేశం

జీవితాంతం సహజ మరణం వరకు జైలులోనే ఉండాలి’ అని స్పష్టం చేసిన న్యాయస్థానం… బాలిక తల్లిదండ్రులకు రూ.10 లక్షల పరిహారం చెల్లించాలని ఆదేశం.. 2024 నవంబర్ 1న వడమాలపేట ఏఎం పురం ఎస్టీ కాలనీలో దారుణ ఘటన… మూడున్నరేళ్ల సన్విత అలియాస్ చెంచమ్మను బిస్కెట్లు కొనిస్తానని తీసుకెళ్లిన నిందితుడు

గ్రామ శివారులోకి తీసుకెళ్లి చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడిన దుండగుడు… చిన్నారి ఏడవడంతో గొంతు నులిమి హత్య చేసి మృతదేహాన్ని పొదల్లో పడేసిన నిందితుడు… నిందితుడు నేరాన్ని అంగీకరించడంతో పోక్సో, హత్య కేసుగా మార్పు…. చిన్నారిపై జరిగిన అమానుష నేరానికి కఠిన శిక్ష విధించాలంటూ గతంలో పెద్ద ఎత్తున ధర్నాలు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page