TRINETHRAM NEWS

Trinethram News : గందరగోళం మధ్యే ఏపీలో గ్రూప్-2 మెయిన్స్‌ ముగిసింది. వాయిదా వేయాలంటూ పెద్ద ఎత్తున అభ్యర్థులు రోడ్డెక్కినా పట్టించుకోని ఏపీపీఎస్సీ.. గ్రూప్‌-2 మెయిన్స్‌ ఎగ్జామ్‌ను సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్‌ చేసింది.

గ్రూప్‌-2 మెయిన్స్‌ పరీక్ష వాయిదా వేయడం కుదరదు అంటూ ఏపీ ప్రభుత్వానికి స్పష్టం చేసిన ఏపీపీఎస్సీ.. షెడ్యూల్‌ ప్రకారమే ఎగ్జామ్‌ ను నిర్వహించింది. అయితే.. గ్రూప్‌-2 మెయిన్స్ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయని ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (APPSC) తెలిపింది.

ఆదివారం నిర్వహించిన గ్రూప్‌-2 మెయిన్స్‌ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న 92,250 మంది అభ్యర్థుల్లో 86,459 మంది హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. వారిలో 92శాతం మంది హాజరయ్యారని ఏపీపీఎస్సీ అధికారులు వెల్లడించారు.

గ్రూప్‌-2 మెయిన్స్‌ పరీక్షకు 92 శాతం మంది హాజరైనట్లు ఏపీపీఎస్సీ ప్రకటనలో తెలిపింది.. అయితే.. పరీక్ష వాయిదా వేయకుండా నిర్వహించడంపై ఏపీపీఎస్సీ తీరుపై కొందరు అభ్యర్థులు అభ్యంతరం తెలిపారు.. పరీక్షకు హాజరుకాకుండా నిరసన వ్యక్తం చేశారు.

అభ్యర్థుల ఆరోపణలపై ఏపీపీఎస్సీ ఏపీపీఎస్సీ కీలక వ్యాఖ్యలు చేసింది. పరీక్ష నిర్వహణను దెబ్బతీసేందుకే మెయిన్స్‌కు క్వాలిఫైకాని కొందరు వాయిదా కోరారని ఆరోపించింది.

గ్రూప్-2 మెయిన్స్‌పై హైకోర్టు మార్గనిర్దేశం ప్రకారమే వెళ్తున్నట్లు తెలిపింది. పరీక్ష సకాలంలో జరగకపోతే నిజమైన అభ్యర్థులకు అన్యాయం జరుగుతుందని, కష్టపడిన అభ్యర్థులు తీవ్రంగా నష్టపోతారని APPSC స్పష్టం చేసింది. దాంతోపాటు.. MLC ఎన్నికల దృష్ట్యా కోడ్ పరిధిలో పనిచేయాల్సి ఉంటుందని ఏపీపీఎస్సీ స్పష్టం చేసింది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

group-2 mains exam