జూలై 5, 2026

WhatsApp Image 2024 10 01 at 15.33.57

TRINETHRAM NEWS

851 kg of ganja being transported in two cars seized

ఇద్దరు నిండుతులు అరెస్ట్ కొయ్యూరు ఎస్సై రామకృష్ణ

ఆంధ్రప్రదేశ్, త్రినేత్రం న్యూస్, అల్లూరిజిల్లా ఇంచార్జ్: అల్లూరిజిల్లా, ( కొయ్యూరు మండలం ) రెండు కార్లలో తరలిస్తున్న 851 కిలోల గంజాయి స్వాధీనం. ఇద్దరు నిండుతులు అరెస్ట్ కొయ్యూరు ఎస్సై రామకృష్ణ. రెండు కార్ల లో అక్రమంగా, తరలిస్తున్న 851 కిలోల గంజాయిని కొయ్యూరు పోలీసులు స్వాధీనం పరుచుకుని, ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. ఈ మేరకు కొయ్యూరు ఎస్సై రామకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం గంజాయి అక్రమ రవాణా జరుగుతోందన్న ముందస్తు సమాచారంతో ఇద్దరూ అధికారిక మధ్యవర్తులతో చీడిపాలెం కూడలిలో వాహన తనిఖీలు చేపట్టామన్నారు. ఆ సమయంలో బూదరాళ్ల వైపు నుండి ఒక ద్విచక్ర వాహనం రెండు కార్లు రావటాన్ని పోలీసులు గుర్తించారు.

పోలీసులను చూడగానే వాహనాలను వెనక్కి తిప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తుండగా, అనుమానం వచ్చిన పోలీసులు వాహనాలు వద్దకు చేరుకునేసరికి ద్విచక్ర వాహనంపై వస్తున్న ఇద్దరు వ్యక్తులు. రెండు కార్లో వస్తున్న ఐదుగురు వ్యక్తులు పోలీసులను చూసి తప్పించుకుని పరార్ అయినట్లు తెలిపారు. రెండు కార్ల ద్విచక్ర వాహనాన్ని స్వాధీన పరుచుకుని ఇద్దరు డ్రైవర్లను అదుపులోనికి తీసుకుని విచారించగా, గంజాయి అక్రమ రవాణాకు పాల్పడుతున్నట్లు ఒప్పుకున్నట్లు ఎస్సై తెలిపారు. దీంతో కార్లను సోదా చేయగా ఒక కారులో 185 గంజాయి ప్యాకెట్లు, మరో కార్లో 94 గంజాయి ప్యాకెట్లలో మొత్తం 851 కిలోల గంజాయిని గుర్తించి గంజాయితో పాటు, వాహనాలు ఒక సెల్ ఫోన్ స్వాధీన పరుచుకుని నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలిస్తున్నట్టు ఎస్సై తెలిపారు. పరారైన ఇతర నిందితుల ఆచూకీ పై దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై రామకృష్ణ వివరించారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

851 kg of ganja being transported in two cars seized

You cannot copy content of this page