Candidate Commits Suicide : 4వ వార్డు అభ్యర్థి ఆత్మహత్య

TRINETHRAM NEWS

జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్. నామినేషన్ విత్ డ్రా చేసుకోవాలంటూ కొందరి వేధింపులు.కంసాన్ పల్లికి చెందిన బిజెపి మద్దతుదారుడు ఆవశేఖర్ మృతి పై గ్రామస్తుల ఆగ్రహం రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గ గ్రామపంచాయతీ ఎన్నికల వేళ అపశృతి చోటుచేసుకుంది. ఫరూక్ నగర్ మండలం కంసాన్ పల్లి గ్రామంలో అవశేకర్ అనే యువకుడు ఆత్మహత్యకు పాల్పడడంతో సంచలనంగా మారింది. అవశేకర్ నాల్గవ వార్డు అభ్యర్థిగా పోటీ చేస్తుండడంతో ఇంతలోనే ఆవశేఖర్ రైలు పట్టాలపై ఆత్మహత్యకు పాల్పడ్డాడు అన్న సమాచారం గ్రామాన్ని ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. రైల్వే పోలీసులు గ్రామస్తులకు అందించిన సమాచారం ప్రకారం రైలు పట్టాలపై ఆత్మహత్యకు పాల్పడ్డాడని భావిస్తున్న పోలీసులు మృతదేహం వద్ద ఆధార్ కార్డు లభించడంతో అతను కంసాన్ పల్లికి చెందిన ఆవశేఖర్ గా గుర్తించి గ్రామస్తులకు సమాచారం అందజేశారు. ఆవు శేఖర్ కంసాన్ పల్లి గ్రామ నాలుగో వార్డ్ వార్డు సభ్యుడు పదవికి అభ్యర్థిగా నామినేషన్ వేశారు.

గత నాలుగు రోజులుగా గ్రామంలో కొందరు శేఖర్ ను పోటీ నుండి తప్పుకోవాలని తన నామినేషన్ ఉపసంహరించుకోవాలని కొందరు ఒత్తిడి తీసుకురావడం వేధింపులకు గురి చేశారని గ్రామస్తులు పేర్కొంటున్నారు. నామినేషన్ ఉపసంహరించుకోకపోతే లేనిపోని అవంతరాలు సృష్టించి కేసులు పెడతామని, అమ్మాయిని బలత్కరించినట్లు రేప్ కేసులు కూడా నమోదు చేయిస్తామని శేఖర్ ను కొందరు బెదిరించినట్లు గ్రామస్తులు కొందరు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో శేఖర్ గ్రామంలో కొంతమంది వద్ద ఈ విషయం చెప్పి కన్నీరు మున్నీరుగా విలపించినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. కొంతమంది గ్రామానికి చెందిన వారు తనను నామినేషన్ ఉపసంహరించుకోవాలని చెబుతున్నారని గ్రామ పెద్దల దృష్టికి కూడా తీసుకువచ్చినట్లు చెబుతున్నారు ఈ నేపథ్యంలో శేఖర్ మంగళవారం ఉదయం గ్రామాల్లో కనిపించకుండా పోయాడు.

కాసేపటి క్రితం రైల్వే పోలీసులు ఆవ శేఖర్ రైల్వే పట్టాలపై ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం చెప్పడంతో అది హత్య లేక ఆత్మహత్య అన్న కోణంలో పోలీసులు కూడా దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం రైల్వే పోలీసులు విచారణ జరుపుతున్నారు అదేవిధంగా ఈ మృతి వెనుక రాజకీయ కోణం గ్రామపంచాయతీ ఎన్నికల వ్యవహారం ఉందని ఆరోపణలు వస్తుండడంతో ప్రస్తుతం గ్రామంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. బిజెపి మద్దతుదారుడిగా చెబుతున్న గ్రామస్తులు ఆవశేఖర్ మరణానికి గ్రామానికి చెందినవారు కొందరు కారణమని విషయాన్ని చెబుతున్నడంతో గ్రామంలో పరిస్థితులు నివురు కప్పిన నిప్పులా మారాయి..

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

4th ward candidate commits suicide

You cannot copy content of this page

Scroll to Top