నూతనంగా నిర్మానించిన రామ మందిరంలో బాల రాముడు విగ్ర ప్రాణ ప్రతిష్ట పురస్కరించుకుని ఈరోజు 191 ఎన్టీఆర్ నగర్ లో పల్లకి సేవతో శోభాయాత్రలో పాల్గొన డిప్యూటీ మేయర్, ఎన్ఎంసి బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, కార్పొరేటర్లు
అయోధ్యలో నూతనంగా నిర్మించిన రామ మందిరంలో బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ వేడుకలను పురస్కరించుకుని ఈరోజు నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 7వ డివిజన్ 191 ఎన్టీఆర్ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీరామచంద్ర స్వామి పల్లకి సేవతో శోభాయాత్రలో డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్, ఎన్ఎంసి బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రంగరాయ ప్రసాద్ కార్పొరేటర్లు ప్రణయ ధనరాజ్ యాదవ్, రవి కిరణ్, పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.191 ఎన్టీఆర్ నగర్ గ్రౌండ్ శివాలయం నుంచి ప్రారంభమైన రామ భక్తులు, హిందూ బంధువులు తో కలిసి భారీగా శోభయాత్రలో పాల్గొని కాషాయం జెండాలను చేతపట్టుకుని జైశ్రీరామ్ నినాదాలతో 191 ఎన్టీఆర్ నగర్ మార్మోగింది. ఈ కార్యక్రమం సీనియర్ నాయకులు కూరాకుల రాము, 7వ డివిజన్ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మంజునాథ్, నాయకులు తల్లారి సాయి, యువ నాయకులు ఆనంద్ రెడ్డి, 191 ఎన్టీఆర్ నగర్ ప్రెసిడెంట్ కృష్ణ, వైస్ ప్రెసిడెంట్ శోభరణి, జనరల్ సెక్రటరీ శ్రీనివాస్ రెడ్డి, కాలనీ వాసులు రాజేష్, పూర్ణ, మల్లేష్, పవన్, నర్సింహా, మధు, నర్సింహా, నర్సింహా నాయక్, శేఖర్ చిన్ను, కోటి, జితేందర్, శంభు , కాలనీ వాసులు, భక్తులు, తదితరులు పాల్గొన్నారు.