TRINETHRAM NEWS

14 villages in Bhadradri district flooded due to heavy rains

Trinethram News : భద్రాది జిల్లా : జులై 19
తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలకు వరద పోటెత్తడంతో భద్రాద్రి -కొత్తగూడెం జిల్లా అశ్వా రావుపేట మండలంలోని తెలుగు రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్టు పెద్దవాగుకు 250 మీటర్ల పొడవున గండి పడింది.

ప్రాజెక్టు గరిష్ట నీటి మట్టం 18.6 అడుగులు. మూడు క్రస్ట్ గేట్లలో ఒకటి పనిచేయ కపోవడంతో గురువారం రాత్రి 7.45 సమయంలో కట్ట పూర్తిగా తెగిపోయింది. పెద్దవాగుకు గండిపడటంతో దిగువన అశ్వారావుపేట మండలం గుమ్మడపల్లి కోయరంగాపురం, రమణక్కపేట, కొత్తూరు గ్రామాలకు పాక్షికంగానష్టం జరిగింది.

ఏపీలోని ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలం కమ్మరిగూడెం, ఒంటిబండి, కోయమాదారం, కొత్తపూచి రాల, పాతపూచిరా, అల్లూ రినగర్, సొందిగొల్లగూడెం, వసంతవాడ, గుళ్లవాయి, వేలేరుపాడు గ్రామాలకు భారీగా నష్టం వాటిల్లింది.

కొన్ని గ్రామాల్లో పలు ఇళ్లు వరదలో కొట్టుకుపోయాయి. సహాయక చర్యలుచే పట్టేందుకు వరద ప్రభావిత ప్రాంతాలకు అధికారులు చేరుకునే పరిస్థితి కూడా లేదు. దీంతో వారంతా వేలేరుపాడులో ఉండిపోయారు.

దాదాపు 2వేల కుటుంబా లు ఎవరి దారిన వారు సురక్షిత ప్రాంతాలకు చేరు కుంటున్నట్లు తెలుస్తోంది. గురువారం ఉదయం నుంచి విద్యుత్తు పూర్తిగా నిలిచి పోయింది. బాహ్య ప్రపంచం తో సంబంధాలు తెగిపోవ డంతో ఆ గ్రామాల్లో ఏం జరుగుతుందో ఎవరికీ తెలియడం లేదు.

పెద్దవాగుకు గండిపడిన నేపథ్యంలో ప్రాణనష్టం లేకుండా చర్యలు చేపట్టా లని సీఎస్ శాంతికుమారి ఆదేశాలు జారీ చేశారు.

విషయం తెలుసుకుని జిల్లా కలెక్టర్ జితేష్, నీటిపారు దలశాఖ ఉన్నతాధికారు లతో సీఎస్ సమీక్షించారు. గండి పూడ్చేందుకు రూ. 20కోట్ల వరకు ఖర్చు అవుతుందని జలవనరుల శాఖ డీఈ తెలిపారు…

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

14 villages in Bhadradri district flooded due to heavy rains