సిపిఐ . 100 సంవత్సరాల ప్రస్థానం

TRINETHRAM NEWS

సిపిఐ . 100 సంవత్సరాల ప్రస్థానం.
డిండి గుండ్లపల్లి త్రినేత్రం న్యూస్.

డిండి…
సీపీఐ 100 ఏళ్ల ప్రస్థానం అజేయం…
🔹పేద ప్రజలున్నంతవరకు ఎర్రజండా ఉంటుంది…
🔹సీపీఐ నాయకులు వెంకటరమణ, బుచ్చిరెడ్డి, మైనోద్దీన్, కనకాచారి

1925 డిసెంబర్ 26న,ఆవిర్భవించిన భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ )100వ,సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్బంగా గురువారం డిండి మండలంలోని గ్రామాల్లో సీపీఐ ఎర్రజండాలను సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు బొడ్డుపల్లి వెంకటరమణ, జిల్లా సమితి సభ్యులు తూం బుచ్చిరెడ్డి, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు ఎండి. మైనోద్దిన్, సీపీఐ మండల కార్యదర్శి శ్రీరామదాసు కనకాచారి లు ఎగరవేశారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ
దేశంలో 100 సంవత్సరాల ఉద్యమ పార్టీగా సిపిఐ ఖ్యాతి పొందిందనీ,స్వాతంత్ర్యం కొరకు జరిగిన పోరాటంలో ఆనాడే అనేకమంది ఉరికంబాలు ఎక్కి ప్రాణ త్యాగాలు చేసిన వీరచరిత్ర కలిగిన సీపీఐ దేశ స్వాతంత్య్రం కొరకు ఫ్యూడల్ సంస్థానాల విముక్తి కొరకు తాడిత, పీడిత జనావళి కొరకు వేలాదిమంది ప్రాణాలను కోల్పోయిన ఏకైక పార్టీ సీపీఐ అని అన్నారు.ప్రజా సమస్యలపైన భూ సంస్కరణలు, ఇళ్ల స్థలాలు, పారిశ్రామికీకరణ, వ్యవసాయ అభివృద్ధి తదితర అంశాలపై ఉద్యమాలు చేపట్టిన చరిత్ర కమ్యూనిస్టు పార్టీదని,
తెలంగాణ రాష్ట్ర సాధన కొరకు మొట్టమొదటిగా అంగీకారం తెలియజేసి తెలంగాణ సాధనలో ప్రముఖ పాత్ర వహించిన పార్టీ సీపీఐ అన్నారు. ఉజ్వల చరిత్ర కలిగిన పార్టీ భారత కమ్యూనిస్టు పార్టీ, ( సిపిఐ )100 వసంతాల ఉత్సవాల ప్రారంభం సందర్భంగా నల్లగొండలో పట్టణంలోడిసెంబర్ 30న,మ॥ 2 గంటలకు ప్రదర్శన, సా॥3 గంటలకు ఎన్.జి.కాలేజి గ్రౌండ్లో జరిగే బహిరంగ సభను జయప్రదం చేసేందుకు మండల పార్టీ శ్రేణులు, ప్రజలు అధిక సంఖ్యలో సభకు తరలిరావాలని పిలుపునిచ్చారు.
ఈకార్యక్రమంలో మండల సీపీఐ సహాయ కార్యదర్శులు బొల్లె శైలేష్, తిప్పర్తి విజేందర్ రెడ్డి,కార్యవర్గ సభ్యులు హనుమండ్ల కేశవులు,సోమిడి శ్రీనయ్య,నూనె వెంకటేశ్వర్లు,ఎలిమినేటి హుస్సేన్,లచ్చయ్య,AIYF జిల్లా ఉపాధ్యక్షులు ఎనమల్ల నవీన్,AISF డివిజన్ అధ్యక్షులు సురిగి వినయ్ కుమార్,గ్రామశాఖ కార్యదదర్శులు వంకేశ్వరం చక్రి,శ్రీను, శ్రీనివాస్ రెడ్డి,రాములు,పురుషోత్తం,గోవర్ధన్,సాగర్,సలీమ్,బయ్యా శ్రీను,జంగిలి కొండల్ చంద్రయ్య,తిరుపతయ్య,తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page

Scroll to Top