Trinethram News : Guntur : గుంటూరుకు కేంద్ర ప్రభుత్వం 100 పడకల ఈఎస్ఐ ఆసుపత్రి మంజూరు చేసింది. బుధవారం ఈఎస్ఐసీ 194వ సమావేశంలో ఈ మేరకు కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ నిర్ణయం తీసుకున్నారు.
గుంటూరులో ఈఎస్ఐ ఆసుపత్రి కోసం కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గతంలో చేసిన అభ్యర్థన మేరకు ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఈ ఆసుపత్రి కోసం భూసేకరణ ప్రతిపాద నకు కేంద్రం ఆమోదం తెలిపింది. గుంటూరు జల్లాలో మిర్చి యార్డు, స్పిన్సింగ్ మిల్స్, కోక కోల తదితర పరిశ్రమల్లో పనిచేసే దాదాపు 50 వేలమంది కార్మికు లకు ఈ ఆసుపత్రి ఉపయోగపడుతుంది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App