10 liters of gudumba, 18 liters of liquor and 13 vehicles without number plates were seized.
గోదావరిఖని విట్టల్ నగర్ ఏరియాలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించిన సీఐ
ఇంద్రసేనారెడ్డి
ఈ ప్రోగ్రాం లో 10 లీటర్ల గుడుంబా, 18 లీటర్ల లిక్కర్, 13 నంబర్ ప్లేట్ లేని వెహికల్లను సీజ్ చేయడం జరిగింది.
250నుంచి 300 మందితో మాట్లాడటం జరిగింది.
గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
ముఖ్యంగా ఈ ప్రాంతం మొత్తం కూడా సింగరేణి కార్మికులు, కాంట్రాక్టు కార్మికులు, కూలి పని చేసుకునే ఎక్కువగా ఉంటారు. వీరు వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి జీవనం సాగిస్తున్నారు.
కొంతమంది ఇల్లులు కిరాయికి తీసుకొని ఉంటారు ఇందులో ఇంటి యజమానులకు తెలియజేయునది ఏమనగా ఎవరైనా మీ ఇంటిలో కిరాయికి ఉంటే అట్టి వ్యక్తులకు సంబంధించి పూర్తి వివరాలు తెలిసి ఉండాలి. వారు ఇక్కడి నుంచి వచ్చారు? ఏం చేస్తున్నారు? వాడి ఆధార్ కార్డులు కూడా తీసుకొని ఉండాలి.
అదేవిధంగా మన ఏరియాలో గాంజాయి ఎక్కువ సరఫరా అవుతుంది అని ప్రచారం జరుగుతుంది, కావున ప్రతి ఒక్కరు కూడా ఈ గాంజాయి తాగే గురించి గానీ, తెచ్చి అమ్మే గురించి గానీ సమాచారం ఇవ్వాలని సూచించినది. మత్తు పదార్థాలను మన ఏరియా నుండి సమూలంగా నిర్మూలించాలని వివరించినైనది.
ఈ ఏరియాలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని వాటి యొక్క ప్రాముఖ్యతను వివరించడం జరిగింది.
రోడ్ యాక్సిడెంట్లకు సంబంధించి వాహనాలు యొక్క వాహనదారులకు నడుపుతున్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, హెల్మెట్ ధరించడం, డాక్యుమెంట్లు కలిగి ఉండటం, తాగి బండి నడపకుండా ఉండటం వంటి వాటి గురించి వివరించడం జరిగింది.
మైనర్ పిల్లలకు, డ్రైవింగ్ లైసెన్స్ లేని వారికి ఎట్టి పరిస్థితిలో కూడా వాహనం ఇవ్వరాదని చెప్పడం జరిగింది సైబర్ నేరాలకు సంబంధించి ఏ విధంగా సైబర్ నేరగాళ్లు ఫోన్ కాల్ చేసి, మెసేజ్ పంపి నేరాలకు పాల్పడతా వివరించడం జరిగింది కాబట్టి అందరూ కూడా ఈ సైబర్ నేరాలకు సైబర్ నేరాలకు లోనుకాకుండా తగు జాగ్రత్తలు సూచించనినది.
సోషల్ మీడియా విషయం లో యువకులు ముఖ్యంగా మహిళలు, యువతులు జాగ్రత్తగా ఉండాలని, ఏలాంటి ఫోటోలను స్టేటస్ లో అప్ పెట్టుకోవడం కానీ, అప్లోడ్ చేయడం కానీ చేయకూడదు సోషల్ మీడియాలో వాళ్ళు వచ్చే వాటిని నమ్మి మోసపోవద్దని సూచించినది సూచించనైనది,
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App