ఆగస్ట్ 6, 2026
TRINETHRAM NEWS
World Youth Skills Day

World Youth Skills Day : దేవరకొండ డివిజన్ జులై 15,త్రినేత్రం న్యూస్. వివేకనంద ఒకేషనల్ జూనియర్ కాలేజీ నందు ప్రపంచ యువజన నైపుణ్య దినోత్సవం సందర్భంగా వివేకానంద ఒకేషనల్ జూనియర్ కాలేజ్ లో దేవరకొండ స్పోర్ట్స్ క్లబ్ అధ్యక్షుడు ఎన్ వి టీ సభ్యులతో మరియు విద్యార్థులతో కలిసి కేక్ కట్ చేసి యువజన దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసినారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీచే స్థాపించబడిన ప్రపంచ యువ నైపుణ్యాల దినోత్సవం, యువతకు ఉపాధి, గౌరవప్రదమైన పని, వ్యవస్థాపకత మరియు జీవితకాల అభ్యాసం కోసం నైపుణ్యాలను అందించడంలో ఉన్న వ్యూహాత్మక విలువను వెలుగులోకి తీసుకురావడమే లక్ష్యం అని, యువత మంచి ప్రవర్తన అలవర్చుకోవాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి తాళ్ల శ్రీధర్ గౌడ్, కోశాధికారి కృష్ణ కిషోర్, భాస్కర్ రెడ్డి, వల్లమల్ల ఆంజనేయులు, ఏ గణేష్, ఏ గౌతమ్, సుధాకర్, రాము ,రోజా, అంజలి ,లావణ్య, రాజేష్, క్రీడాకారులు కళాకారులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page