
ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్
25 మంది మహిళలకు ఎలక్ట్రికల్ బైక్లు పంపిణీ
Trinethram News : రాజమహేంద్రవరం : మహిళల ఆర్థికాభివృద్ధి కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. నగర పాలక సంస్థ ఆవరణలో స్వయం సహాయక సంఘ సభ్యులు 25 మంది మహిళలకు ఎలక్ట్రికల్ బైక్‌లను పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, కమిషనర్ కేతన్ గర్గ్ మాట్లాడుతూ స్వయం సహాయక సభ్యుల కుటుంబ సభ్యుల జీవనోపాధి మెరుగు కోసం మెప్మా ద్వారా రాపిడో భాగస్వామ్యంతో వివిధ బ్యాంకుల ద్వారా రుణ సదుపాయంతో వీటిని పంపిణీ చేయడం జరుగుతోందన్నారు.
ఈ కార్యక్రమాన్ని కూటమి ప్రభుత్వం ఫైలెట్ ప్రాజెక్టుగా రాష్ట్రంలో విశాఖపట్నంలో 400, విజవాడలో 400, నెల్లూరుకు 50, గుంటూరుకు 50, కర్నూలు, తిరుపతి, కాకినాడ, రాజమండ్రి పట్టణాలకు 25 చొప్పున మొత్తం 1000 మందికి ఈ ఎలక్ట్రికల్ బైక్‌లను పంపిణీ చేయడం జరిగిందన్నారు. మహిళ సాధికారత, వారి స్వయం ఉపాధి, జీవనోపాధి కోసం రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధ్యాత ఇస్తోందన్నారు. కూటమి ప్రభుత్వం డ్వాక్రా సంఘాల ప్రోత్సహిస్తోందని, ఇచ్చిన ఎన్నికల హామీలను నెరవేరుస్తోందన్నారు. దానిలో భాగంగానే మూడు ఉచిత గ్యాస్ సిలెండ్ల పథకంలో భాగంగా గత ఏడాది దీపావళి నుంచే ప్రారంభించి ఒక గ్యాస్ సిలెండర్‌ను కూడా అందించడం జరిగిందని గుర్తు చేశారు.
ఈ ఏడాది మే నుంచే తల్లికి వందనం పథకం ప్రారంభమవుతుందన్నారు. మహిళల భద్రతకు ఇప్పటికే ప్రభుత్వం శక్తి యాప్‌ను అందుబాటులోకి తీసుకువచ్చిందన్నారు. మహిళ రైడర్లు ఎస్ ఓ ఎస్, శక్తి యాప్ లను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో 100 ఈ రిక్షాలు ఏర్పాటు చేసే యోచన ఉన్నందున మహిళలను భాగస్వామ్యం చేయాలని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ కోరారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, నగర పాలక సంస్థ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
