Women’s Day : వాకర్స్ యోగా అండ్ లాఫింగ్ క్లబ్ చే‌ ఘనంగా మహిళా దినోత్సవం

TRINETHRAM NEWS

వృద్ధులకు వృద్ధాప్య పింఛన్లు పంపిణీ.

రాజమండ్రి, మార్చి 5:వాకర్స్ యోగా అండ్ లాఫింగ్ క్లబ్ స్వచ్చంద సేవాసంస్థ ఆధ్వర్యంలో ఎస్.కె.వి.టి.కళాశాల ఆనందా గార్డెన్స్ లో మహిళా దినోత్సవ కార్యక్రమం, వృద్ధులకు వృద్ధాప్య పింఛన్ల కార్యక్రమం క్లబ్ అధ్యక్షుడు శనపతి సత్తిబాబు అధ్యక్షతన ఘనంగా జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మేయరు ఆదిరెడ్డి వీరరాఘవమ్మ,ఈట్ అండ్ ప్లే ఎం.డి.వెలగల పద్మావతి, తూర్పుగోదావరిజిల్లా ఉమెన్స్ పోర్ట్ అధ్యక్షురాలు పోతిరెడ్డి నళిని,ఎ.టి.బాబా, వసుంధర దంపతులను క్లబ్ కార్యదర్శి గుబ్బల గంగాభవాని వేదిక మీదకుఆహ్వానించారు.

ముఖ్య అతిధి వీరరాఘవమ్మ మాట్లాడుతూ మహిళలంతా మహిళా చట్టాలను తెలుసుకుని భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదగాలని కోరుతూ ఈ క్లబ్ నిర్విరామంగా ఇటువంటి సేవలు అందించడం గర్వించదగ్గ విషయమని కొనియాడారు.వెలగల పద్మావతి తమ తల్లి పడాల లక్ష్మీ తులసి చేతుల మీదుగా వృద్ధాప్య పింఛన్లు నిమిత్తం రూ.5 వేలు,యేరుకొండ రాధాకుమారి రూ.5 వేలు వృద్ధాప్య పింఛన్లు నిమిత్తం అందచేశారు.బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్న కడియపు దుర్గేష్ అనే విద్యార్థికి అయినాపురపు వెంకటలక్ష్మి,చిదంబరరావు దంపతులు విద్య నిమిత్తం రూ.20 వేలు
అందచేశారు.వసుంధర,ఎ.టి.బాబా దంపతులు తమ 61 వ వివాహ దినోత్సవం సందర్భంగా వృద్ధులందరికి చీరలు పంపిణీ చేశారు.పి.నాగవేణి తన భర్త కి.శే.పి.వెంకటేశ్వరరావు జ్ఞాపకార్థం వృద్ధులందరికీ మిల్క్ బ్రెడ్ ను , సూర్యకుమారి,కె.ప్రభాకరరావు దంపతులు అల్పాహారాన్ని అందించారు.ముఖ్య అతిధుల చేతుల మీదుగా 80 మంది వృద్ధులకు ఒక్కొక్కరికి రూ.500 చొప్పున రూ.40 వేలు వృద్ధాప్య పింఛన్ల రూపంలో అందించారు.ఈ కార్యక్రమానికి విచ్చేసిన మహిళా మూర్తులందరికీ మహిళా దినోత్సవ‌శుభాకాంక్షలు తెలుపుతూ ముఖ్య అతిథులకు క్లబ్ సభ్యులచే చిరుసన్మానం జరిగింది.ఈ కార్యక్రమంలో భేరి రత్నాంబ, లంకే శ్రీదేవి,రాళ్ళబండి సత్యవాణి,అవనిజ రత్నకుమారి,సూరపురెడ్డి తాతారావు,చెల్లుబోయిన సూర్యనారాయణమూర్తి,రవి రాజకుమార్ (యు.ఎస్.ఎ),అనసూరి వెంకటశ్రీనివాస్,బాబ్జి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.ఈ కార్యక్రమం క్లబ్ కార్యదర్శి గుబ్బల గంగాభవాని ఆధ్వర్యంలో జరిగింది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Women's Day celebrated

You cannot copy content of this page

Scroll to Top