TRINETHRAM NEWS

మన సంస్కృతి సాంప్రదాయాలు కాపాడుకోవాలి

-మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి

-ఆంధ్ర జ్యోతి ఆధ్వర్యములో ముత్యాల ముగ్గుల పోటీల కార్యక్రమాన్ని ప్రారంభించిన పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు డాక్టర్ దనసరి అనసూయ సీతక్క గారు

ఈ రోజు ములుగు జిల్లా కేంద్రంలో ఆంధ్రజ్యోతి స్టాఫ్ రిపోర్టర్ రాకేష్ గారి ఆధ్వర్యములో కెనరా బ్యాంక్ వారి సహకారం తో ఏర్పాటు చేసిన ముత్యాల ముగ్గుల పోటీల ప్రారంభానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర మంత్రి వర్యులు డాక్టర్ సీతక్క గారు
ఈ సందర్భంగా మాట్లాడుతూ
మన పూర్వీకులు మనకు నేర్పిన సంస్కృతి సాంప్రదాయాలను వాటి మూలాలను మహిళలు ఎప్పటికీ మరవ కూడదు యువతులు మహిళలు ముగ్గులు వేస్తుంటే ఇప్పుడే ములుగు లో సంక్రాంతి వచ్చినట్లు అనిపిస్తుంది అని ముగ్గుల పోటీలు పెట్టీ మహిళలను ఒకే చోటకు చేర్చిన ఆంధ్రజ్యోతి పత్రిక ఎలక్ట్రానిక్ యాజమాన్యం కు ఈ జిల్లా లో పని చేస్తున్న ఆంధ్రజ్యోతి పత్రిక ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు అభినందనలు తెలుపుతూ ఈ పండగ ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు నింపాలని కోరుకుంటూ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలిపారు
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు,పత్రిక ఎలక్ట్రానిక్ మీడియా సోదరులు మహిళా మణులు,తదితరులు పాల్గొన్నారు