TRINETHRAM NEWS

మహిళ సాధికారత ప్రతిఒక్కరి బాధ్యత

పాలకుర్తి మండలం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

ఈ రోజు పాలకుర్తి మండల పరిషత్ కార్యాలయం లో జిల్లా సంక్షేమ అధికారి పి. వేణు గోపాల్ ఆధ్యర్యంలో జిల్లా మహిళ సాధికారత కేంద్ర కోఆర్డినేటర్ దయా అరుణ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మిషన్‌ శక్తి పథకం మహిళల సాధికారత కోసమని గ్రామంలోని వివో సమావేశంలో పాల్గొని మాట్లాడారు. బాలికల రక్షణ, విద్య, లింగ నిర్ధారణను నివారించేందుకే ‘బేటీ బచావో.. బేటీ పడావో’ పథకాన్ని కేంద్ర ప్రభుత్వంఅమలుచేస్తోందన్నారు.

ఈ కార్యక్రమంలో భాగంగా మహిళలపై పిల్లలపై జరుగుతున్న లైంగిక వేధింపులు వాటిపై పని చేస్తున్న చట్టాలు, టోల్ ఫ్రీ నెంబర్స్, మహిళలకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పథకాలు మొదలైన అంశాలను గురించి అవగాహన కల్పించారు. మహిళలపై పిల్లలపై జరుగుతున్న లైంగిక వేధింపులు వాటిపై పని చేస్తున్న చట్టాలు, మహిళ ల కోసం పని చేసే సఖి (181) సెంటర్ యొక్క సేవలు, వివాహ నమోదు చట్టం, సోషల్ మీడియా అవగాహన, లింగ సమానత్వం ,టోల్ ఫ్రీ నెంబర్స్, బ్యాంకింగ్ ఉపయోగాలు , ఆర్థిక అక్షరాస్యత అవగాహన మరియు పథకాలు మరియు ఉన్నత విద్య మొదలైన అంశాలను గురించి అవగాహన చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ అల్లం పూర్ణ చంద్ర రావు, అపో . కొమురయ్య లావణ్య , కమిటీ సభ్యులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App