
దేన్నైనా క్రీడా స్పూర్తితో స్వీకరించాలి
ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పిలుపు
రంజాన్ క్రికెట్ టోర్నమెంట్ విజేతలకు ట్రోఫీలు అందచేత
Trinethram News : రాజమహేంద్రవరం : క్రీడల్లో గెలుపోటములు సహజమని, దేన్నైనా క్రీడా స్పూర్తితో స్వీకరించాలని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. ఆల్ సమీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అధినేత మహ్మద్ అబ్దుల్లా సహకారంతో స్థానిక జాంపేటలోని పోలీసు గ్రౌండ్‌లో ఈ నెల 7వ తేదీన ప్రారంభమైన రంజాన్ కప్ 2025 టోర్నమెంట్ సీజన్
3 నేటితో ముగిసింది. టోర్నమెంట్ ముగింపు వేడుకలకు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ముఖ్య అతిధిగా హాజరై విన్నర్స్‌గా నిలిచిన కొంతమూరు లెవెన్స్‌కు, రన్నర్‌గా నిలిచిన కొంతమూరు సూపర్స్‌కు ట్రోఫీలను అందచేశారు.
అలాగే మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్, మ్యాన్ ఆఫ్ టోర్నమెంట్, బెస్ట్ బ్యాట్స్ మెన్, బెస్ట్ బౌలన్, బెస్ట్ ఫీల్డర్ తదితర అంశాల్లోని వారికి మహ్మద్ అబ్దుల్లా ట్రోఫీలను అందచేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ యువ క్రీడాకారులను ప్రోత్సహిస్తున్న అబ్ధుల్లాను అభినందించారు. ఇటువంటి టోర్నమెంట్ల ద్వారా యువతలో శారీరక, మానసిక ధారుడ్యం రావడంతో పాటు కొత్త ఉత్సాహం వస్తుందన్నారు. కూటమి ప్రభుత్వం ముస్లింలకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందన్నారు. సీఎస్‌ఆర్ నిధులతో నగరంలోని ముస్లింల బరియన్ గ్రౌండ్‌ను శుభ్రం చేయిస్తామన్నారు.
వక్ఫ్ బోర్డుకు త్వరలోనే కమిటీలు వేస్తామన్నారు. వక్ఫ్ బోర్డు ఆస్తులను పరిరక్షిస్తామన్నారు. నగరంలోని మసీదులు, షాదీ ఖానాలను అభివృద్ధి చేస్తామన్నారు. ఆల్ సమీ గ్రూఫ్ ఆఫ్ కంపెన్సీ అధినేత మహ్మద్ అబ్దుల్లా మాట్లాడుతూ రంజాన్ మాసాన్ని పురష్కరించుకుని ప్రతీ ఏటా యువతను ఉత్సాహ పరిచేందుకు క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం తాము ఆనవాయితీగా పెట్టుకున్నామన్నారు. తమకు ఎంతో పవిత్రమైన రంజాన్‌లో అందరూ సంతోషంగా ఉండాలన్నదే తమ భావమని, అందు కోసం తమకు సాధ్యమైన కార్యక్రమాలను చేస్తుంటామన్నారు. ఉన్నదాంట్లో పేదలకు సేవ చేయాలన్నదే అల్లాప్‌ా తమకు చూపించిన మార్గమని, రంజాన్ మాసం, రంజాన్ పండుగ పరమార్ధం కూడా అందేనని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, ముస్లిం పెద్దలు తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
