గెలిపించండి.. అవినీతి లేకుండా పని చేస్తా..

TRINETHRAM NEWS

గెలిపించండి.. అవినీతి లేకుండా పని చేస్తా..

    వేగేశన నరేంద్ర వర్మ 

బాపట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్

బాపట్ల నియోజకవర్గములోని ప్రతి ఇంటికి తెలుగుదేశం పార్టీని చేరువ చేయడమే లక్ష్యంగా బాపట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ శ్రీ వేగేశన నరేంద్ర వర్మ గారు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఇంటింటికి తెలుగుదేశం మీ మాటే – నా బాట, కార్యక్రమం లో భాగంగా కర్లపాలెం మండలం లోని యజలి గ్రామంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, జనసేన నాయకుల తో కలసి వెళ్లి తెలుగుదేశం పార్టీ విధి విధానాలు వివరిస్తూ మహిళలకు చీర, నిత్యావసర వస్తువులు తెచ్చుకునే సంచి, తన గురించి తెలియజేసే కరపత్రాన్ని అందజేసి ఆశీర్వదించమని కోరారు. అనంతరం ఉమ్మడి మానిఫెస్టో లోని సంక్షేమ పథకాలు గురుంచి వివరించిన బాపట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ ఛార్జ్ శ్రీ వేగేశన నరేంద్ర వర్మ గారు.

ఈ సందర్భంగా నరేంద్ర వర్మ గారు మాట్లాడుతూ…

బాపట్ల తెలుగుదేశం పార్టీ ఎం.ఎల్. ఏ అభ్యర్థిగా పోటీ చేస్తున్నా గెలిపించండి అవినీతి చేయకుండా పని చేస్తా.. మీకు నేను హామీ ఇస్తున్నా ..

ప్రస్తుతం ఉన్న వైసిపి ప్రభుత్వం తో ప్రజలు ఎన్నో ఇబ్బందులకు గురౌతున్నారు.

తెలుదేశం పార్టీ హయాంలోనే నిరుద్యోగులకు ఎన్నోఉపాధి అవకాశాల కల్పన కల్పించింది

వైసిపి ప్రభుత్వములో దోచుకోవడం దాచుకోవడం తప్ప ప్రజలకు చేసింది ఏమి లేదు.

తెలుగుదేశం పార్టీ అధికారం లోకి రాగానే మినీ మేనిఫోస్టో లోని 6 పధకాలు అములు చేస్తాం

ఈ కార్యక్రమములో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top