ఆగస్ట్ 17, 2026

WhatsApp Image 2023 12 27 at 7.38.00 PM

TRINETHRAM NEWS

తెలుగుదేశం పార్టీ ని గెలిపించుకొని మీ భవిష్యత్ కు బంగారు బాట వేసుకోండి

వేగేశన నరేంద్ర వర్మ
బాపట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్

బాపట్ల నియోజకవర్గములోని ప్రతి ఇంటికి తెలుగుదేశం పార్టీని చేరువ చేయడమే లక్ష్యంగా బాపట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ శ్రీ వేగేశన నరేంద్ర వర్మ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఇంటింటికి తెలుగుదేశం మీ మాటే – నా బాట,భవిష్యత్ కు గ్యారంటీ కార్యక్రమం లో భాగంగా నేడు బాపట్ల మండలంలోని పూండ్ల గ్రామం లో తెలుగుదేశం పార్టీ నాయకులతో కలసి వెళ్లి తెలుగుదేశం పార్టీ విధి విధానాలు వివరిస్తూ మహిళలకు చీర, నిత్యావసర వస్తువులు తెచ్చుకునే సంచి, తన గురించి తెలియజేసే కరపత్రాన్ని అందజేసి ఆశీర్వదించమని కోరారు. అనంతరం భవిష్యత్ కు గ్యారంటీ పత్రాలలో వారి కుటుంబ సభ్యుల వివరాలు నమోదు చేసి భవిష్యత్తు గ్యారెంటీ సంక్షేమ పథకాలు గురుంచి వివరించిన బాపట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ ఛార్జ్ శ్రీ వేగేశన నరేంద్ర వర్మ.

ఈ సందర్బంగా నరేంద్ర వర్మ మాట్లాడుతూ…

రాబోయే ఎన్నికలో వైసిపీ అరాచక పాలనకు ఓటు తో బుద్ది చెప్పాలన్నారు

ఒక్క అవకాశం పేరు తో అధికారం లోకి వచ్చిన ముఖ్య మంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అన్ని రంగాలలో దోపిడీ చేసిందన్నారు

వైసిపీ అధికారం లోకి వచ్చిన తర్వాత ఒక్క పంట కాల్వలు కూడా బాగు చేయలేదన్నరు.అదే విధంగా గ్రామాలలో కనీసం త్రాగు నీరు సౌకర్యం కల్పించలేదు అన్నారు.

తెలుగుదేశం ప్రభుత్వం అధికారం లోకి వచ్చిన వెంటనే ప్రతి ఇంటికి మంచి నీటి కుళాయి ఏర్పాటు చేస్తామన్నారు

ఆడ బిడ్డ నిధి కింద మహిళలకు ప్రతి నెల రు.1500ఇస్తామన్నారు.

అనంతరం నూతన సంవత్సర క్యాలెండర్ ను వారికి అందజేసి తనని ఆశీర్వాదించాలని కోరారు

ఈ కార్యక్రమం లో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page