![](https://trinethramnews.in/wp-content/uploads/2025/02/WhatsApp-Image-2025-02-06-at-18.32.36.jpeg)
గిరిజన యువతికి న్యాయం జరిగేది ఎప్పుడు
అల్లూరి జిల్లా త్రినేత్రం న్యూస్ ఫిబ్రవరి 7 : అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు నియోజకవర్గము హుకుంపేట మండలము. గిరిజన యువతి గంపరాయి బాల ప్రభ భూ న్యాయపోరాట 11వ రోజు దీక్షకు కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఏపీ కాంగ్రెస్ పార్టీ నాయకుడు పాచి పెంట చిన్నస్వామి
ఈ సందర్భంగా మాట్లాడుతూ, గంపరాయి బాల ప్రభ తండ్రి భూమిని గిరిజనేతరుడు ఆక్రమణకు గురి అయి ఉంది, దీనిని సమగ్ర పూర్తిస్థాయి విచారణ చేసి తక్షణమే బినామీ దారుల నుండి భూమిని ఇప్పించి న్యాయం చేయాలని కాంగ్రెస్ పార్టీ నుండి డిమాండ్ చేస్తున్నాము. సుమారు రెండెండ్లుగా భూ న్యాయ పోరాటం కోసం పోరాడుతున్న గిరిజన యువతి గంపరాయి బాలప్రభ కు రెవెన్యూ సిబ్బంది ఉన్నత అధికారులు ప్రజాప్రతినిధులు గిరిజన మహిళకు చిన్న చూపుతో సహకరించక పోవటం చాలా దురదృష్టకరం.
రాత్రి పగలు తనకు న్యాయం జరగటం కోసం 11వ రోజులు చంటి బిడ్డతో గిరిజన మహిళ భాలప్రభ తన చంటి బిడ్డతో నిరాహార దీక్ష చేయడం చాలా గర్వించదగ్గ విషయము. ఈ సమస్యని పూర్తిగా నిజమైన గిరిజన జాతి ప్రతి బిడ్డ ప్రతి రాజకీయ నాయకులు సంపూర్ణ మద్దతు ప్రకటించాలని కోరుతున్నాము. ఇప్పటికైనా అధికారులు కళ్ళు తెరిచి గిరిజన యువతకి సంపూర్ణముగా న్యాయం చేయాలని అలాగే పూర్తిగా రక్షణ కల్పించాలని,ఈ విషయంపై అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ ,పాడేరు ఐటీడీఏ ప్రొజెక్ట్ అధికారి వారు ,అల్లూరి సీతారామరాజు జిల్లా, ఎస్.పి, వారు తక్షణమే చొరవ చూపి ఈ మహిళకి తన పోరాటానికి కావాల్సిన న్యాయం చేయాలని, కాంగ్రెస్ పార్టీ నుండి డిమాండ్ చూస్తున్నాము. లేనియెడల అన్ని రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలతో భారీ ఎత్తున ఆందోళన చేయడానికి సిద్ధంగా ఉన్నామని కాంగ్రెస్ పార్టీ నుండి ప్రభుత్వ అధికారులకి హెచ్చరిక చేస్తూ కోరుతున్నాము.
ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షులు తాపుల కృష్ణారావు గిరిజన సమైక్య జిల్లా అధ్యక్షులు కూడా రాధాకృష్ణ కాంగ్రెస్ పార్టీ నాయకుడు గంజాయి భాగ్యరాజు తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
![tribal girl get justice](https://trinethramnews.in/wp-content/uploads/2025/02/WhatsApp-Image-2025-02-06-at-18.32.36-1024x576.jpeg)