జూన్ 26, 2026

0497b58e5f7e7b32e6a201bad25970c6

TRINETHRAM NEWS

Weather department good news for Telugu states

Trinethram News : జూన్‌ 2న ఏపీలోకి.. జూన్‌10 తెలంగాణలోకి రుతుపవనాల రాక

నైరుతి రుతుపవనాలు చురుగ్గా విస్తరిస్తున్నాయి. 2, 3 రోజుల్లో మరింత విస్తరించేందుకు అనుకూల అవకాశాలు ఉన్నాయంటూ విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం వెల్లడించింది. జూన్ 2 నుంచి ఏపీలో వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.

జూన్ 2 నుంచి ఏపీలో వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఏపీలో రెండు రోజుల పాటు పొడి వాతావరణం ఉంటుందని.. దక్షిణ కోస్తాలో వడగాలులు వీస్తాయని.. అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపారు.

ఇప్పటికే కేరళ తీరాన్ని తాకిన నైరుతీ రుతుపవనాలు చాలా చురుగ్గా ముందుకు విస్తరిస్తున్నాయి. రుతుపవనాల ప్రభావంతో భారీ మేఘాలు కమ్ముకుని భారత భూభాగంలో అక్కడక్కడ భారీ వర్షాలు అందుకుంటున్నాయి.

మరో రెండు రోజుల్లో ఏపీలో ఋతుపవనాలు విస్తరించే ఛాన్స్ బలంగా ఉందని చెప్పారు వాతావరణశాఖ అధికారులు. అన్ని అనుకూలిస్తే .. జూన్ ఫస్ట్‌ వీక్‌లోనే రాయలసీమలోకి రుతుపవనాలు ప్రవేశిస్తాయని అంచనా వేస్తున్నారు.

మరోవైపు తెలంగాణ రైతులకు హైదరాబాద్‌ వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. జూన్‌ 10లోగా నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశిస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది.

జూన్‌ 11 వరకు రాష్ట్రమంతటా విస్తరిస్తాయని వెల్లడించారు. జూన్‌ 1 నుంచి మూడురోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేరొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Weather department good news for Telugu states

You cannot copy content of this page