TRINETHRAM NEWS

వైసీపీ ఐదేళ్ల పాలనలో రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా నడిచిందన్న పొన్నవోలు

అధికారంలో ఉన్నవారు తమ పార్టీ నేతలను వేధిస్తున్నారని ఆరోపణ

పాలనపై వ్యంగ్యంగా వ్యాఖ్యానిస్తే నేరం ఎలా అవుతుందని ప్రశ్న

Trinethram News : రాష్ట్రంలోని అధికార పార్టీ నాయకులు ఇప్పుడు ట్రైలర్ చూపిస్తున్నారని, ఎన్నికల తర్వాత తాము అధికారంలోకి రాగానే వైసీపీ నాయకులు వారికి సినిమా చూపిస్తారని వైసీపీ లీగల్ సెల్ నాయకుడు, మాజీ అదనపు అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి హెచ్చరించారు. వైసీపీ ఐదేళ్ల పాలనలో రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా నడిచిందని అన్నారు.

అధికారంలో ఉన్నవారు తమ పార్టీ నాయకులను వేధిస్తూ తరిమేస్తున్నారని పొన్నవోలు ఆరోపించారు. ఈపూరు మండలం బొమ్మరాజుపల్లెకు చెందిన నాగేశ్వరరావు పాలనపై వ్యంగ్యంగా వ్యాఖ్యానిస్తే అది నేరం ఎలా అవుతుందని ప్రశ్నించారు. పోలీసులు ఆయనను తీసుకెళ్తే తాను హైకోర్టులో లంచ్‌మోషన్ పిటిషన్ వేసినట్టు చెప్పారు. వినుకొండ మండలం ఏనుగుపాలెంలో మహిళ హత్య కేసు ఏడాది దాటినా ఎటూ తేల్చని పోలీసులు తలదించుకోవాలని పొన్నవోలు విమర్శించారు. పల్నాడు జిల్లా వినుకొండలోని మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు కార్యాలయంలో నిన్న విలేకరులతో మాట్లాడుతూ ఆయనీ వ్యాఖ్యలు చేశారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

We will show the