జూన్ 26, 2026

WhatsApp Image 2023 12 29 at 11.18.40 AM

TRINETHRAM NEWS

Achechennaidu : జ‌గ‌న్ దోచుకున్నదంతా క‌క్కిస్తాం..బ‌ట‌న్ నొక్కుడు అందినంత దొబ్బుడు

మంగ‌ళ‌గిరి- ఏపీ టీడీపీ చీఫ్ అచ్చెన్నాయుడు షాకింగ్ కామెంట్స్ చేశారు. సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఇప్ప‌టి వ‌ర‌కు అధికారాన్ని అడ్డం పెట్టుకుని సంక్షేమ ప‌థ‌కాల పేరుతో దోపిడీకి పాల్ప‌డ్డాడ‌ని ఆరోపించారు. సీఎంతో పాటు మంత్రులు, ప్ర‌జా ప్ర‌తినిధులు సాగించిన దుర్వినియోగం బ‌ట్ట‌బ‌య‌లు చేస్తామ‌ని ప్ర‌క‌టించారు .

మంగ‌ళ‌గిరిలో టీడీపీ చీఫ్ మీడియాతో మాట్లాడారు. ప్ర‌జ‌ల్ని వంచించ‌డ‌మేనా జ‌గ‌న్ రెడ్డి నీతి..నిజాయితీ అని ప్ర‌శ్నించారు. జ‌గ‌న్ వ‌న్నీ అబ‌ద్దాల‌ని , 85 శాతం హామీలు ఎగ్గొట్టార‌ని ఆరోపించారు. నాలుగున్న‌ర ఏళ్ల‌లో వైసీపీ స‌ర్కార్ రూ. 10 ల‌క్ష‌ల కోట్ల అప్పులు చేసింద‌న్నారు.

జ‌గ‌న్ రెడ్డి హామీల అమ‌లులో 85 శాతం అమ‌లు కాలేద‌న్నారు. 99 శాతం అమ‌లు చేశామ‌ని జ‌గ‌న్ రెడ్డి చెప్ప‌డం పూర్తి అబ‌ద్ద‌మ‌న్నారు. ఇచ్చిన హామీలు 730 అయితే వాటిలో 109 మాత్ర‌మే అమ‌లు చేశారంటూ ఫైర్ అయ్యారు కింజార‌పు అచ్చెన్నాయుడు.

అధికారాన్ని అడ్డం పెట్టుకుని సంక్షేమ ప‌థ‌కాల పేరుతో దోచుకున్నాడ‌ని , తాము అధికారంలోకి వ‌చ్చాక తిన్న‌దంతా క‌క్కిస్తామ‌ని అన్నారు.

You cannot copy content of this page