TRINETHRAM NEWS

We welcome the announcement of retirement benefit of Anganwadi workers

సీపీఐ, ఏఐటీయూసీ నాయకులు.

Trinethram News : Medchal : అంగన్వాడీ టీచర్లు, ఆయాల రిటైర్మెంట్ బెనిఫిట్ ను 50 వేల నుండి 2 లక్షలు,లక్ష రూపాయలు పెంచుతామని నిన్న మంత్రి సీతక్క ప్రకటించడాన్ని సీపీఐ, ఏఐటీయూసీ గా స్వాగతిస్తున్నాంని కేవలం ప్రకటనల వరకే పరిమితం కాకుండా వెంటనే జి. ఓ జారీ చెయ్యాలని నేడు జగతగిరిగుట్ట సీపీఐ కార్యాలయంలో సీపీఐ, ఏఐటీయూసీ నాయకులు పత్రిక ప్రకటన విడుదల చేయడం జరిగింది.
ఈ సందర్భంగా సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి ఉమా మహేష్,ఏఐటీయూసీ ఉపాధ్యక్షుడు ఏసురత్నం మాట్లాడుతూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో అంగన్వాడీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఎన్నో ఉద్యమాలు చేశామని, కానీ గత ప్రభుత్వం అంగన్వాడీ కార్మికుల పై నిర్బంధం పెంచిందని,చివరికి ఎన్నికల సమయంలో సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడా వెంకట్ రెడ్డి అంగన్వాడీ సమస్యల పై అప్పటి మంత్రి హరీష్ రావ్ తో అనేక సార్లు చర్చలు జరిపిన శూన్యమేనని అంగన్వాడీ కార్మికుల సమస్యలను పరిష్కరించలేదని అన్నారు.
ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి 6 నెలలు గడిచినా ప్రకటించక పోవడం వల్ల గత నెల రోజులుగా అంగన్వాడీ కార్మికులు తమ డిమాండ్ల సాధన కోసం ఉద్యమిస్తుంటే స్పందించి నిన్న మంత్రి ప్రకటించడం ఇది కార్మికుల విజయమని అన్నారు.

ప్రభుత్వ భూముల,చెరువుల పరిరక్షణ కొరకు ఏర్పాటు చేసిన హైడ్రా నేతృత్వంలో భూములు, చెరువుల కబ్జాలను అరికట్టాలని,నిన్న హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరికిచెరువు,మహాదేవ పురంలో అక్రమ కట్టడాలను కూల్చివేస్తామని చెప్పాడని సీపీఐ గా స్వాగతిస్తూ ఆ రెండు నిర్మాణాలే కాకుండా సర్వే నెంబర్ 348/1,వెంకటేశ్వర దేవలయా స్థలం,సర్వే నెంబర్ 326,342,329,307,119, ఆదే విదంగా ప్యాక్స్ సాగర్, గంధం చెరువు,అంబిర్ చెరువు, సురారం చెరువు చిన్న చితక చెరువులు అనేకం కబ్జా అయ్యాయని వాటి వివరాలను హైడ్రా కమిషనర్ కి సీపీఐ ఆధ్వర్యంలో ఇస్తామని తెలిపారు. కబ్జాదారుల పై చర్యలు తీసుకొని వారి చేతిలో మోసపోయిన బాధితులను కాపాడాలని కోరారు.

ఈ కార్యక్రమంలో సిపిఐకోశాధికారి సదానంద, కార్యవర్గ సభ్యులు ఏఐటీయూసీ అధ్యక్షుడు హరినాథ్,మునిసిపల్ అధ్యక్షుడు రాములు, శాఖ కార్యదర్శి సహదేవ్ రెడ్డి, ప్రజానాట్యమండలి అధ్యక్షుడు బాబు, ఏఐటీయూసీ నాయకులు సామెల్, రామస్వామి పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

We welcome the announcement of retirement benefit of Anganwadi workers