టిఎస్ యుటిఎఫ్ మహాసభల వాల్ పోస్టర్ విడుదల
వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ వికారాబాద్ జిల్లా విద్యా వైజ్ఞానిక సదస్సుమహాసభల వాల్ పోస్టర్ ఆవిష్కరించిన పరిగి ఎమ్మెల్యే టి రామ్మోహన్ రెడ్డి
ఈనెల 14న పరిగి పట్టణంలో టిఎస్ యుటిఎఫ్ వికారాబాద్ జిల్లా 5వ మహాసభలను జయప్రదంచేయాలని,పరిగిశాసనసభ్యులు,టి రామ్మోహన్ రెడ్డి అన్నారు ఆదివారం తన నివాసంలో జిల్లా మహాసభల వాల్ పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఈ మహాసభల సందర్బంగా విద్యారంగం బలోపేతంకావడం కోసంరాష్ట్రప్రభుత్వానికి,అవసరమైన సలహాలు, సూచనలు ఇచేలా చర్చలుజరపాలని కోరారు ఆ దిశగా ప్రజా ప్రభుత్వం కచ్చితంగా అమలు జరిపేలా చర్యలు తీసుకుంటుందని అన్నారుఈ విద్యా వైజ్ఞానిక,సదస్సులో జిల్లాలోని ఉపాధ్యాయులు, అధ్యాపకులు అధిక సంఖ్యలో పాల్గొని,విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.. ఈ కార్యక్రమం లో జిల్లా అధ్యక్షులు వెంకటరత్నం, ప్రధాన కార్యదర్శి రాములు,మహాసభల కన్వీనర్ వెంకటయ్య, జిల్లా నాయకులు మోహిజ్ ఖాన్,మల్లేష్, బుచ్చయ్య, వివిధ మండలాల,అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు దశరథ,శేఖర్,వెంకటేష్, జంగయ్య, సీనియర్,నాయకులు జైపాల్,బసప్ప శివరాజ్, అజ్మత్, శ్రీనివాస్,వెంకటయ్య, తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App