తేదీ: 31/12/2024.
గ్రామ రెవెన్యూ రైతు సభ.
ఎన్టీఆర్ జిల్లా: (త్రినేత్రం) న్యూస్. ప్రతినిధి ;
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఎన్టీఆర్ జిల్లా, తిరువూరు నియోజకవర్గం, విస్సన్నపేట మండలం , చుండ్రుపట్ల గ్రామ సచివాలయంలో మీ భూమి- మీ హక్కు గ్రామ రెవెన్యూ సదస్సు జరిగింది. మండల తహసిల్దారు లక్ష్మీ కళ్యాణి రైతులను ఉద్దేశించి మాట్లాడారు.. గత ప్రభుత్వంలో రైతులకు అన్యాయం జరిగినట్లయితే ఈ ఉమ్మడి కూటమి ప్రభుత్వంలో
న్యాయం జరుగుతుందని తెలిపారు. గత ప్రభుత్వంలో మీ భూమిని మీకు తెలియకుండా బడా నాయకులు గాని , ఎవరైనా సరే ఆన్లైన్లో పేరు మార్పులు, సర్వే నంబర్లు, మార్చి ఆ భూమి మాదేనని మిమ్మల్ని హింసిస్తూ ఉన్న, భూమి సరిహద్దుల్లో లోటు పాట్లు ఏమైనా గాని మీరు భయపడవలసిన అవసరం లేదని , మీ భూమి- మీ హక్కు ద్వారా మీకే చెందుతుందని రైతులకు చెప్పడం జరిగింది.
భూ సమస్యలు ఉన్న రైతులు ఆర్జీ పత్రాలను తీసుకుని వారి సమస్యలను వివరంగా అందులో రాచి రెవిన్యూ బృందానికి ఇచ్చారు. తక్షణమే
ఆర్జీ పత్రాలను పరిశీలించి మీకు న్యాయం జరుగుతుందని భరోసా ఇచ్చారు. అడ్వాన్సుగా మండలంలోని ప్రజలందరకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కొత్త సంవత్సరం సందర్భంగా ప్రతి ఇంట సిరిసంపదలు, సుఖశాంతులు కలిగి ఎటువంటి కష్టనష్టాలు రాకూడదని దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు. సమస్యలో ఉన్న రైతులు రెవెన్యూ బృందానికి , ఉమ్మడి కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. సభకు వచ్చిన రైతులకు ప్రాథమిక తెల్లదేవరపల్లి ఉప ఆరోగ్య కేంద్రం వారు ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ గ్రామ అధ్యక్షులు జె. సుధీర్, సర్పంచ్
డి. బాలకొండయ్య, తదితరులు పాల్గొన్నారు.
సభకు వచ్చిన ప్రతి ఒక్కరికి
భోజన సదుపాయం ఏర్పాటు చేయడం జరిగింది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App