WhatsApp Image 2024 07 27 at 14.40.51
Vana Mahotsva by Teja students
Trinethram News : స్థానిక తేజ టాలెంట్ స్కూల్ విద్యార్థులు పాఠశాలలో, ఎవరి పుట్టినరోజు అయిన, ఆరోజు పాఠశాలలో మొక్కను నాటుతున్నారు. పాఠశాలలో చదివిన చాలామంది విద్యార్థులు ఇలా పళ్ళ మొక్కలను, నీడనిచ్చే మొక్కలను నాటారు. పాఠశాలలో నాటిన నేరేడు పళ్ళ మొక్క నేడు నేరేడు పళ్ళను, మామిడి చెట్టు మామిడి కాయలను కాసింది.
ఇలా పిల్లలు గతంలో వేసిన మొక్కలు ఫలాలను ఇస్తుండడంతో ఇతర పిల్లలు స్ఫూర్తిని పొంది, నేడు వారి పుట్టినరోజున పూల మొక్కలను, పళ్ళ మొక్కలను నాటుతున్నారు.నేడు పాఠశాలలో 9వ తరగతి విద్యార్థిని ఎస్. ప్రణీత పుట్టినరోజు సందర్భంగా పాఠశాలలో ఉపాధ్యాయుల సమక్షంలో మొక్కను నాటారు. కార్యక్రమంలో ఇన్చార్జి రామ్మూర్తి ,సెక్రెటరీ సంతోష్ కుమార్, సోమనాయక్,నవ్య, వాహబ్,రమేష్, పిఈటి రాంబాబు ఇతర ఉపాధ్యాయులు,విద్యార్థులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
