భాజపాతో వైకాపాది కంటికి కనిపించని పొత్తు: వైఎస్‌ షర్మిల

TRINETHRAM NEWS

భాజపాతో వైకాపాది కంటికి కనిపించని పొత్తు: వైఎస్‌ షర్మిల

Trinethram News : విశాఖ: రాష్ట్రంలో కుమ్మక్కు రాజకీయాలు నడుస్తున్నాయని ఏపీ కాంగ్రెస్‌ చీఫ్‌ వైఎస్‌ షర్మిల అన్నారు. పాలకపక్షం, ప్రతిపక్షం భాజపాతో ములాఖత్‌ అయ్యాయని ఆరోపించారు..

విశాఖలో పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆమె మాట్లాడారు. ”భాజపాతో వైకాపా కంటికి కనిపించని పొత్తు పెట్టుకుంది. రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు జగన్‌ మాట్లాడారు. అధికారంలోకి వచ్చాక దానిపై పోరాటమే లేదు..

విశాఖకు ఏం చేశారు? రైల్వే జోన్‌ కూడా ఇవ్వలేదు. గంగవరం పోర్టులో రాష్ట్ర వాటాను అప్పనంగా ఇచ్చేశారు. విశాఖ ఉక్కు కార్మాగారానికి తూట్లు పొడుస్తున్నారు..

స్టీల్‌ప్లాంట్‌ను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి నిర్వీర్యం చేశాయి. ఇప్పుడున్న ప్రభుత్వం పోవాలి.. కాంగ్రెస్‌ రావాలి” అని పిలుపునిచ్చారు..

You cannot copy content of this page

Scroll to Top