జూలై 16, 2026

WhatsApp Image 2024 02 23 at 09.14.19

TRINETHRAM NEWS

గంజాయి తాగుతూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ బిగ్ బాస్ ఫేమ్ షణ్ముఖ్

షణ్ముఖ్ అన్నయ్య కోసం ఆయన ఫ్లాట్ కు వెళ్లిన పోలీసులు

ఆ సమయంలో గంజాయి తాగుతున్న షణ్ముఖ్

ఇద్దరినీ అరెస్ట్ చేసిన పోలీసులు

షణ్ముక్ బ్రదర్ సంపత్‌ వినయ్‌ ఇప్పుడు తెలుగు టూ స్టేట్స్లో బ్రేకింగ్ టాపిక్ అయ్యారు.

ప్రేమించిన అమ్మాయిని మోసం చేశాడనే కారణంతో.. కేసులో ఇరుక్కోవడమే కాదు.. గాంజా కేసులో కూడా అనుకోకుండా పట్టుపడ్డాడు.

ఇక అసలు విషయం ఏంటంటే..!

షణ్ముఖ్‌ సోదరుడు సంపత్‌ వినయ్‌ ఓ యువతితో ప్రేమలో ఉన్నాడు..ఇద్దరికి ఎంగేజ్‌మెంట్‌ కూడా అయ్యింది..

ఆ తర్వాత ఆమెను దూరం పెట్టేశాడు. ఆరు రోజుల్లోపెళ్లి ఉండగా మరో యువతిని పెళ్లిచేసుకున్నాడు సంపత్ వినయ్‌.
ఈ విషయం తెలుసుకున్న ప్రియురాలు..

పోలీసులను ఆశ్రయించింది.
తనను ప్రేమ పేరుతో మోసం చేశాడని ఫిర్యాదు చేసింది. యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు..

సంపత్‌ని అదుపులోకి తీసుకునేందుకు షణ్ముఖ్‌ నివాసానికి వెళ్లారు. పోలీసులతో పాటు యువతి కూడా అక్కడికి వెళ్లింది. ఇంట్లోకి వెళ్లి చూడగా..షణ్ముఖ్‌ ఒక్కడే కనిపించాడు. అయితే అతని దగ్గర గంజాయి లభించడంతో పోలీసులు షణ్ముక్‌ను కూడా అదుపులోకి తీసుకున్నారు. అన్నదమ్ముళ్లిద్దరినీ గాంజా కేసులో విచారిస్తున్నారు

You cannot copy content of this page