ఆగస్ట్ 6, 2026

WhatsApp Image 2024 10 21 at 18.22.22

TRINETHRAM NEWS

సంతోషాల నడుమ సాగిన జీడీకే 6,A గనిలో పూర్వం పనిచేసి రిటైర్మెంట్ అయిన కార్మికుల అపూర్వ సమ్మేళనం

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

జీడీకే 6 A గనిలో పూర్వం పనిచేసి రిటైర్మెంట్ అయిన కార్మికుల అపూర్వ సమ్మేళనం ఆదివారం సంతోషాల నడుమ ఘనంగా సాగింది.

మనం పూర్వ విద్యార్థులు సమ్మేళనం చూశాం కానీ , ఈ మధ్య పూర్వ ఉద్యోగుల సమ్మేళనాలు కూడా జరుపుకుంటూ వారి సంతోషాలను , బాధలను పంచుకుంటున్నారు . ఈ మేరకు గోదావరిఖని గంగానగర్ లోని గోదావరి దాబా లో వకుళాభరణం గోపాలాకృష్ణ అద్యక్షతన ఆదివారం జీడీకే 6 A గనిలో పూర్వం పనిచేసి రిటైర్మెంట్ అయిన కార్మికుల అపూర్వ సమ్మేళనం సంతోషాల నడుమ ఘనంగా సాగింది. పూర్వపు రోజులను గుర్తు చేసుకుంటూ అరే రాజిగా, మల్లిగా, పోచిగా అంటూ ఆప్యాయంగా పలకరించుకున్నారు. అందరూ ఒకే చోట కలుసుకోవడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేసారు. అందరూ ఒకరిని ఒకరు ఆత్మీయంగా సన్మానించుకున్నారు. వి గోపాలస్వామి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రతాప్ రెడ్డి, శంకర్, బండ మెండి మాధవరెడ్డి, పాషా తదితరులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page