TRINETHRAM NEWS

Unfurling of National Flag on the occasion of Telangana Liberation Day

గోదావరిఖని త్రినేత్రం ప్రతినిధి

తెలంగాణ విమోచన సందర్భాన్ని పురస్కరించుకొని గోదావరిఖని తిరుమల నగర్ లో బిజెపి సీనియర్ నాయకులు పెద్దపల్లి జిల్లా సభ్యత్వం ఇన్చార్జ్ క్యాతం వెంకటరమణ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు అనంతరం వారు మాట్లాడుతూ నిజాం నాయకుడు మీరు ఉస్మాన్ అలీ ఖాన్ ఆరాచక పాలన నుండి తెలంగాణకు నిజమైన స్వాతంత్రం సెప్టెంబర్ 17 1948 లభించిందని వేలాదిమంది మానప్రాణాలకు కారకులైన నైజాం రాక్షస పాలనను అంతమొందించ్చి ఉక్కు మనిషి హోమ్ మినిస్టర్ సర్దార్ వల్లభాయ్ పటేల్ సైనిక చర్య ద్వారా సంస్థానాన్ని స్వాధీనం చేసుకుని స్వాతంత్ర ఫలాలను అందించిన మహనీయుడు అని అన్నారు.

నిజాం పరిపాలనలో రజాకారులు సాగించిన ఆకృత్యాలకు అంతే లేకుండా పోయిందనిరాజాకార్ల నాయకుడైన కాశీం రజ్వి వెళ్లే మార్గంలో ఎవరైనా అడ్డం వస్తే వారిని గుర్రాలకు కట్టి ఈడ్చుకు వెళ్లేవారు అని నిజాం కు వ్యతిరేకంగా వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడుతున్నారని తెలిస్తే వారిని బహిరంగంగా కాల్చి చంపేవారు అట్టి రాక్షస పాలన నుండి తెలంగాణకు విమోచన లభించి స్వాతంత్ర విపణిలో జయకేతనం ఎగరవేసిన రోజు అని అన్నారు. ఈ కార్యక్రమంలో క్యాతం వెంకటరమణ తో పాటు బిజెపి నాయకులు, బస్తీ వాసులు నారాయణ, కుంభాల గోపాల్, ఐలయ్య, పెద్దపల్లి ప్రవీణ్, జనగామ సాగర్, సుతారి రమేష్ బాబు, డాక్టర్ రవి, నంబయ్య, దాసరి ఉషాలు, గట్టయ్య, అశోఖ్, ప్రభు స్వామి, రమేష్, తిరుపతి తదితరులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Unfurling of National Flag on the occasion of Telangana Liberation Day