Under the leadership of BJP State Mahila Morcha Executive Member Somarapu Lavanya
కాంగ్రెస్ సర్కార్ మహిళలకు ఇచ్చే హామీలను కొరకు ఎమ్మార్వో ఆఫీస్ ముందు ధర్నా ఎమ్మార్వోకు వినతిపత్రం
రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
రామగుండం ఎమ్మార్వో ఆఫీస్ ముందు రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు శిల్పారెడ్డి ఆదేశాల మేరకు కాంగ్రెస్ సర్కార్ మహిళలకు ఇచ్చిన హామీలు వెంటనే నెరవేర్చాలని కోరుతూ బిజెపి రాష్ట్ర మహిళా మోర్చా ఎగ్జిక్యూటివ్ మెంబర్ సోమారపు లావణ్య ఆధ్వర్యంలో ఎమ్మార్వో ఆఫీస్ ముందు ధర్నా కార్యక్రమం నిర్వహించారు అనంతరం ఎమ్మార్వో కు వినతి పత్రం అందజేయడం జరిగింది అనంతరం ఈ కార్యక్రమంలో సోమారపు లావణ్య మాట్లాడుతూ
కాంగ్రెస్ సర్కార్ మహిళలు ఇచ్చిన హామీలు
వెంటనే నెరవేర్చాలని కోరుతూ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఇప్పటికీ ఎనిమిది నెలలు పూర్తయింది కానీ ఇప్పటివరకు ఇచ్చిన హామీలు ఏమీ కూడా అమలు చేయడం జరగలేదు మహిళలకి ఎన్నో హామీలు
ఇచ్చింది. గద్దె నెక్కాక వాటిని గాలికి వదిలేసింది వెంటనే ఇచ్చిన హామీలు నెరవేర్చాలని భారతీయ జనతా మహిళ మోర్చ డిమాండ్ చేస్తుంది..
డిమాండ్స్
- మహిళలకి మహాలక్ష్మి పథకం కింద ఇస్తానన్న 2500/- వెంటనే ఇవ్వాలి…
కనీసం జనవరి నుండి బకాయిలు కలిపి చెల్లించాలి… 6 నెలల బకాయిలు 15 వేలు - నవవధు కి ఇస్తానన్న తులం బంగారం డిసెంబర్ నుండే అమలు చేయాలి…
అప్పటి నుండి పెళ్లి చేసుకున్న ప్రతి యువతికి తులం బంగారం ఇవ్వాలి - 18 సం నిండిన కాలేజీ కి వెళ్ళే ప్రతి ఆడపిల్లలకి ఇస్తానన్న స్కూటీలు వెంటనే ఇవ్వాలి
- వారికి ఇస్తానన్న ఐదు లక్షల విద్యార్థి హామీ కార్డు వెంటనే ఇవ్వాలి
- మహిళలకు పెపెన్షస్ 4000 బకాయిలు తో సహా చెల్లించాలి
ఈ పథకాలను వెంటనే అమలు చేయాలని లేనియెడల పెద్ద మొత్తంలో ధర్నాలు నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామని వారు అన్నారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు ప్రసన్న, పావని, శిరీష, సుమతి, రమ్య, రజిత, పద్మ, మల్లేశ్వరి, అధిక సంఖ్యలో మహిళలు కార్యకర్తలు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App