TRINETHRAM NEWS

76వ గణతంత్ర దినోత్సవం త్రివర్ణ పతాకం ఆవిష్కరణ చేసి ఘనంగా నిర్వహించారు

సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో

పాలకుల విధానాలతో కార్మిక చట్టాలకు పెను ప్రమాదం

తుమ్మల రాజారెడ్డి రాష్ట్ర అధ్యక్షులు

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

గోదావరిఖనిలోని శ్రామిక భవన్లో సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా త్రివర్ణ పతాకం ఆవిష్కరించడం జరిగింది అనంతరం ఆయన మాట్లాడుతూ కార్మికులందరూ సమిష్టిగా పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను నేడు కార్మిక కర్షకుల ఓట్లతో గెలిచిన పాలకులు గెలిపించుకున్న వారిని మరిచి బడా పెట్టుబడిదారులకు అనుకూలంగా అసంఘటిత సంఘటిత కార్మికులకు అనుకూలంగా ఉన్న కార్మిక చట్టాలను మార్చి చట్టబద్ధతలేని కోడులుగా తయారు చేస్తున్నారని కొత్త రైతు చట్టాల వలన రైతులకు నష్టం కలిగే విధానాలు చేస్తున్నారని విమర్శించారు కార్మిక కర్షకులను కేవలం ఓటు బ్యాంకుగానే చూస్తున్నారు తప్ప వారికి లబ్ధి చేకూర్చే విధంగా గెలిచిన పాలకులు చూడడం లేదని, కనీసం పార్లమెంటులో కార్మికుల రైతు చట్టాల గురించి సైతం మాట్లాడడం లేదని వారికి చట్టసభల్లో చోటు కల్పించేలా ప్రభుత్వాలు ఆలోచించాలని అన్నారు.

నేటికీ చట్టబద్ధంగా రావాల్సిన హక్కులకే కార్మికులు యాజమాన్యాలపై పోరాడుతూనే ఉన్నారని ఆయన యాజమాన్యాలు పట్టించుకోకుండా మొండిగా పోతున్నందున భారత రాజ్యాంగం కల్పించిన కార్మిక కర్షక ప్రజాల హక్కుల రక్షణ కోసం కార్మికులందరూ ఏకం కావాలన్నారు. మరోవైపు మతం పేరుతో అన్నదమ్ముల వలె కలిసి ఉన్న వివిధ మతాల మధ్య చిచ్చు పెడుతూ భారత లౌకిక విధానానికి భంగం కలిగించేలా చూస్తున్నారు ప్రజా వ్యతిరేక ప్రభుత్వ విధానాలపై కార్మిక కర్షక ప్రజలను చైతన్యం చేస్తూ ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు, ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యులు తోట నరహరి రావు, అర్జి1, అధ్యక్షులు ఆరేపల్లి రాజమౌళి, ఏ శంకరయ్య, నంది నారాయణ, జంగాపల్లి మల్లేష్, తదితరులు పాల్గొన్నారు,

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App