ఆగస్ట్ 31, 2026
TRINETHRAM NEWS
Uday Krishna Complaint Sajjanar

Uday Krishna Complaint Sajjanar : త్రినేత్రం న్యూస్ : సీపీ తన కుటుంబ సభ్యులను ఎన్‌కౌంటర్ చేస్తానని బెదిరించాడంటూ ఫిర్యాదు …. కస్టడీ సమయంలో విచారణ చేసిన ప్రతి పోలీసుపై ఫిర్యాదు చేస్తున్న ఉదయ్ కృష్ణారెడ్డి… నిబంధనలకు విరుద్ధంగా అత్తాపూర్ పోలీసులు వ్యవహరించారని, తనపై అనుచితంగా ప్రవర్తించారని, బూతులు తిట్టారని ఉప్పర్‌పల్లి కోర్టు దృష్టికి తీసుకువెళ్లిన ఉదయ్

అత్తాపూర్ పోలీస్ స్టేషన్‌లో ముగిసిన ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కస్టడీ…. కస్టడీ ముగిసిన అనంతరం మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచిన పోలీసులు… నిన్న రాత్రి ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డిని విచారించేందుకు అత్తాపూర్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన సీపీ సజ్జనార్… నిన్న విచారణ సమయంలో చాలా అభ్యంతరకర మాటలు మాట్లాడారని సీపీ సజ్జనార్‌పై ఉదయ్ కృష్ణారెడ్డి మేజిస్ట్రేట్‌కు ఫిర్యాదు

మేజిస్ట్రేట్‌ నుంచి అందరినీ బయటకు పంపించిన జడ్జి…. సీపీ సజ్జనార్‌తో పాటు విచారణ చేసిన పోలీసులకు నోటీసులు ఇవ్వాలంటూ మేజిస్ట్రేట్‌కు తెలిపిన ఉదయ్ కృష్ణారెడ్డి…. మేజిస్ట్రేట్‌ ముందు బోరున విలపించిన ఉదయ్ కృష్ణారెడ్డి…. సీసీటీవీ కెమెరాలు లేని చోట విచారణ చేసినట్లు ఆరోపణ… రిటైర్డ్ ఏసీపీ పూర్ణచందర్ రావు విచారణలో ఎలా పాల్గొంటాడంటూ అడ్వకేట్ ప్రశ్న

అడ్వకేట్లను కూడా చంపేస్తామని బెదిరించినట్లు తెలిపిన ఉదయ్ కృష్ణారెడ్డి, అతని అడ్వకేట్లు…. టాస్క్ ఫోర్స్ ఆఫీస్‌కు తీసుకెళ్లి టార్చర్ చేసి, కొట్టారంటూ మేజిస్ట్రేట్‌ ముందు తెలిపిన ఉదయ్ కృష్ణారెడ్డి…. 13 మంది తెలుగు ట్రైనీ ఐపీఎస్‌లు ఉన్నారని, వారి జీవితాలు కూడా నాశనం చేస్తామని బెదిరించినట్లు ఫిర్యాదు…. అత్తాపూర్ ఇన్‌స్పెక్టర్‌కు షోకాజ్ నోటీసు

సీసీటీవీ కెమెరాలు లేని చోట ఎలా విచారణ చేశారని ప్రశ్న?…. రెండు రోజుల్లోగా వివరణ ఇవ్వాలని తెలిపిన మేజిస్ట్రేట్‌… అత్తాపూర్ పోలీసులపై ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి పిటిషన్…. అత్తాపూర్ పోలీసులకు నోటీసులు ఇచ్చిన కోర్టు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page