SP Sneha Mehra : ఎస్.సి/ఎస్.టి యాక్ట్ మరియి హత్య కేసులోని ఇద్దరు నేరస్థులకు ‘రెండు సార్లు యావజ్జీవ కారాగార శిక్ష’

TRINETHRAM NEWS

త్రినేత్రం వికారాబాద్ నియోజకవర్గ ప్రతినిధి. వికారాబాద్ జిల్లా, నవాబ్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలో 2014 సంవత్సరంలో గంగ్యాడ నాగమణి ఫిర్యాదు మేరకు, తన భర్త ప్రభాకర్ ను పాత కక్ష్యలు మనసులో పెట్టుకొని కొట్టి చంపినారు అనే ఆరోపణపై నమోదు అయిన హత్య మరియు ఎస్సీ, ఎస్టీ చట్టం కేసులో తుది తీర్పు వెలువడింది. ఈ కేసులో నేరస్థులుగా తేలిన ఇద్దరు నిందితులు – ఎ1) కొత్తపల్లి లక్ష్మి మరియు ఎ2) కొత్తపల్లి సత్యనారాయణ కు రంగారెడ్డి జిల్లా, ఎల్.బి. నగర్‌లోని ప్రత్యేక న్యాయస్థాన జడ్జ్ శ్రీమతి ఎం. భవాని గారు కీలక తీర్పు ఇవ్వడం జరిగింది అని జిల్లా ఎస్పీ శ్రీమతి స్నేహ మెహ్రా ఐపీఎస్ తెలిపినారు.

ఇట్టి కేసులోని హత్య నేరం లో ఇద్దరు నిందితులకు జీవిత ఖైదుతో పాటు తల 15,000 రూపాయలు జరిమానా, మరియు ఎస్సీ, ఎస్టీ చట్టం సెక్షన్ లో కూడా ఇద్దరికీ జీవిత ఖైదుతో పాటు ఒక్కొక్కరికి 15,000 రూపాయలు జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు. ఈ విధంగా ఇద్దరు నిందితులకు రెండు సార్లు యావజ్జీవ కారాగార శిక్ష (జీవిత ఖైదు), ఒక్కొకరికి మొత్తం 30,000 రూపాయల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు ఇచ్చారని జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా, ఐపీఎస్ తెలియజేశారు.

ఈ కేసు యొక్క విచారణ మరియు న్యాయస్థానంలో వాదనల కోసం కృషి చేసిన పి‌పి ఎస్. ప్రతాప్ రెడ్డి, అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ జి. భద్రాద్రి ,ఈ కేసు యొక్క దర్యాప్తులో అనేక మంది విచారణాధికారులు (ఐ.ఓలు) వివిధ సమయాల్లో పాలుపంచుకున్నారు. మొదట ఎఫ్ఐఆర్ జారీ చేసిన 1వ విచారణాధికారి పి. శ్రీనివాస్, అప్పుడు నవాబ్‌పేట పోలీస్ స్టేషన్ ఎస్ఐ, 2వ విచారణాధికారి, ఏ.వి. రంగా రెడ్డి, అప్పుడు ఇంచార్జ్ డియస్ పి వికారాబాద్ , 3 వ విచారణాధికారి అప్పటి వికారాబాద్ డి‌ఎస్‌పి టి. స్వామి, ఈ కేసు యొక్క ప్రస్తుత సూపర్వేసింగ్ అదికారి ప్రస్తుత వికారాబాద్ డి‌ఎస్‌పిఎన్. శ్రీనివాస్ రెడ్డి, , ప్రస్తుత మోమిన్ పేట్ సి‌ఐ వెంకట్, ప్రస్తుత పోలీస్ స్టేషన్ అధికారి జి. పుండ్లిక్, కేసు యొక్క వివరాలను నిర్వహించడంలో కోర్టు డ్యూటీ ఆఫీసర్లు (సీడీఓలు) కె. నాగేశ్ ,ఎండి. షబ్బీర్ పాషా,

బ్రీఫింగ్ & లైజనింగ్ ఆఫీసర్
ఎ. శ్రీనివాస్ గౌడ్ లను జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా, ఐపీఎస్ అభినందించడం జరిగింది.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

'Twice Life Imprisonment' for two criminals

You cannot copy content of this page

Scroll to Top