TRINETHRAM NEWS

Trinethram News : వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డిపై తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు అధికారులు చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు. ఎస్వీ గోశాలలో గోవులు మృతి చెందాయని అసత్య ప్రచారాలపై భూమనపై ధర్మకర్తల మండలి ఫిర్యాదు చేసింది.

ఈ సందర్భంగా టీటీడీ బోర్డు సభ్యుడు భాను ప్రకాష్ రెడ్డి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజుకు ఫిర్యాదు చేశారు. ఎస్వీ గోశాలలో 100 గోవులు మరణించాయని, పవిత్రమైన గోశాలను గోవధ శాలగా మార్చారంటూ కరుణాకర్ రెడ్డి తప్పుడు ఆరోపణలు చేశారని భాను ప్రకాష్ రెడ్డి ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఇలాంటి నిరాధార ఆరోపణలు చేసిన భూమన కరుణాకర్ రెడ్డిపై ఐటీ యాక్ట్ 74, బీఎన్ఎస్ యాక్ట్ 356 కింద కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని పోలిసులను లిఖితపూర్వకంగా కోరారు భాను ప్రకాష్ రెడ్డి.

ఇక, భక్తుల మనోభావాలు దెబ్బతినేలా భూమన కరుణాకర్ రెడ్డి వ్యవహరించారని టీటీడీ బోర్డు సభ్యులు భాను ప్రకాష్ రెడ్డి తెలిపారు. ఎస్వీ గోశాలపై అసత్య, అబద్దపు ప్రచారాన్ని చేశారు.. కరుణాకర్ రెడ్డి దృష్టికి లోపం ఉంది ఏమో.. ఇష్టం వచ్చినట్లుగా అసత్య ప్రచారం చేస్తున్నారు..

నోరు ఉంది కధ అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు.. నిరాధార ఆరోపణలు చేసిన భూమనపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేయామని కోరాం.. కరుణాకర్ రెడ్డి చైర్మన్ గా ఉన్నప్పుడు పెద్ద సంఖ్యలో గోవులు చనిపోయాయి.. గతంలో మేము వైసీపీ హాయంలో జరిగిన అక్రమాలపై ఆధారాలతో బయట పెట్టామని తేల్చి చెప్పారు. వైసీపీ హాయంలో పురుగులు పట్టిన ఆహారాన్ని గోవులకు పెట్టారని భాను ప్రకాష్ రెడ్డి ఆరోపించారు.

ఇక, టీటీడీలో జరుగుతున్న అక్రమాలపై విజిలెన్స్ విచారణ కొనసాగుతోంది అని భాను ప్రకాష్ రెడ్డి పేర్కొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు వైసీపీ చేసినా అక్రమాల అన్నిటి పైనా చర్యలు తీసుకుంటుందన్నారు. భూమన కరుణాకర్ రెడ్డి ఒక్కడే కాదు.. అందరి అవినీతిని బయటకు తీస్తానని చెప్పుకొచ్చారు.

నేను లోకల్ లే టీటీడీలో ఆయన కంటే ఎక్కువ సమాచారం నా దగ్గర ఉంటుంది.. భవిష్యత్తులో టీటీడీపై ఎలాంటి ఆధారాలు లేకుండా అసత్య ప్రచారాలు చేసినా, మాట్లాడినా ఏ స్దాయి వ్యక్తి పైనా అయినా సరే కఠినమైన చర్యలు తీసుకుంటాం.. ఆ దిశగా బోర్డులో నిర్ణయం తీసుకుంటామని టీటీడీ బోర్డు సభ్యులు భాను ప్రకాష్ రెడ్డి వెల్లడించారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

TTD case against YCP