బాబాసాహెబ్ కు ఘన నివాళి”
ఆంధ్రప్రదేశ్ అల్లూరి సీతరామరాజు జిల్లా (అరకులోయ) టౌన్
త్రినేత్రం న్యూస్ డిసెంబర్. 07 :
*మహనీయుడు, మేధావి, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా, ఏపీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాసిపెంట శాంతకుమారి ఆదేశాల మేరకు అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు వ్యాలీ నియోజకవర్గం మండల కేంద్రంలో బాబాసాహెబ్ కి, పూలమాల వేసి, నివాళులర్పించిన అరకు లోయ కాంగ్రెసు పార్టీ రాష్ట్ర నాయకుడు పాసిపెంట చిన్న స్వామి, మరియు పార్టీ శ్రేణులు.
సృష్టిలో సూర్య, చంద్రులు ఉన్నన్ని నాళ్లు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ ప్రజల హృదయాల్లో శాశ్వతంగా, చిరస్థాయిగా ఉండిపోతారు.
అంబేద్కర్ తన చిన్నతనం నుండి కుల వివక్ష, అంటరానితనం లాంటి ఎన్నో దురాగతాలను భరించి, భారత దేశంలో అత్యంత ఉన్నత స్థాయికి ఎదిగి, మహనీయుడిగా కీర్తించబడినారు.
ముఖ్యమంత్రిగా తరువాత కాంగ్రెస్ శ్రేణులు , డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను కొనసాగించేందుకు నిరంతరం శ్రమించారు.
కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా పేద, దళిత, బడుగు, బలహీన వర్గాలకు అన్ని విధాలా అండగా నిలిచారు.
చంద్రబాబు హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసినట్లే, అంబేద్కర్ 125వ జయంతిని పురస్కరించుకొని 125 అడుగుల విగ్రహాన్ని ప్రతిష్టిస్తామని అసెంబ్లీ సాక్షిగా ప్రకటించి, తర్వాత పట్టించుకోలేదు.
మా నాయకూరలు ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెసు పార్టీ ప్రధాన కార్యదర్శి పాచి పెంట శాంతకుమారి ఆధ్వర్యంలో మహనీయుడు అంబేద్కర్ ఆశయ సాధన కోసం నియజవర్గ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరం కలిసికట్టుగా కృషి చేస్తాం. అని ఏపీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు పాసిపెంట చిన్న స్వామి తెలిపారు, ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ రాష్ట్ర కోఆర్డినేటర్ తెలగంజి సోమేశ్వరరావు, అల్లూరి సీతారామరాజు జిల్లా యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు ఎం ప్రేమ్ కుమార్, మండల అధ్యక్షుడు పాంగి గంగాధర్, యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు నాని ,మోహన్ కుమారు, తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App