WhatsApp Image 2025 01 31 at 21.00.07
గిరిజన సంప్రదాయ జీవన విధానం. ప్రపంచానికి తెలిసేటట్లుగా అరకు చలి ఉత్సవాలు.
అల్లూరి జిల్లా అరకులోయ త్రినేత్రం న్యూస్ ఫిబ్రవరి 1: అల్లూరి జిల్లా అరకు లోయలో ప్రభుత్వం నిర్వహిస్తున్న చలి ఉత్సవాలు ఆదివాసి సాంప్రదాయ, సాంస్కృతిక, జీవన విధానాలు, ప్రపంచానికి తెలిసే విధంగా, రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. పర్యాటకులకి,స్థానిక గిరిజనులకు,ఎటువంటి అసౌకర్యం కలగకుండా తగు జాగ్రత్తలు తీసుకొని నిర్వహిస్తున్నారు. పర్యాటకులకు గిరిజనులకు ఆకర్షిస్తున్న.సాంస్కృతిక కార్యక్రమాలు, హెలికాప్టర్ రైడ్, హాట్ హెయిర్ బెలూన్, మోటర్ గ్లైడింగ్, ప్రత్యేక ఆకర్షణలుగా నిలుస్తున్నాయి. పర్యాటకం పెంపుదలే లక్ష్యంగా వీటిని రాష్ట్రం ప్రభుత్వం నిర్వహిస్తుంది.చలి ఉత్సవాలు భాగంగా,
నేడు కార్యక్రమాలు బొర్రా గృహాల నుంచి అరకు డిగ్రీ కళాశాల వేదిక వరకు ఉదయం ఏడు గంటల నుంచి ఉదయము 11 గంటల వరకు సైక్లింగ్.
11 గంటలకు అరకు మండల పరిషత్ కార్యాలయం వద్ద ప్లాంటేషన్ డ్రైవ్
మధ్యాహ్నం 12 గంటలకు డిగ్రీ కళాశాల ప్రధాన వేదిక వద్ద
2 గంటలకు అరకులోయ కాఫీ హౌస్ లో కాఫీ రుసుల టేస్టింగు.
3 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎక్స్పర్ట్స్ తో ముఖాముఖి.
సాయంత్రం 5 గంటల నుంచి సంస్కృతిక కార్యక్రమాలు,అరకు ఫ్యాషన్ షో, గిరిజన నృత్యాలు, మార్షల్ ఆర్ట్స్ , పుట్ స్టెప్స్, సినీ కళాకారులతో కామెడీ స్కిట్స్, ఆకర్షణీయంగా నిలవనున్నాయి.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
