తెలంగాణ రవాణా శాఖలో అధికారుల బదిలీలు.
హైదరాబాద్ డిసెంబర్ 30: తెలంగాణలో కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆయా ప్రభుత్వ శాఖల్లో కీలక అధికారులను బదిలీ చేస్తున్న విషయం తెలిసిందే.
తాజాగా రాష్ట్ర రవాణా రోడ్లు భవనాల శాఖలో ముగ్గురు జాయింట్ ట్రాన్స్ పోర్ట్ కమిషనర్‌లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
హైదరాబాద్ జేటీసీగా ఉన్న పాండురంగ నాయక్‌ను జేటీసీ అడ్మిన్‌గా ట్రాన్స్‌ఫర్ చేసింది హైదరాబాద్ జేటీసీ అడ్మిన్‌గా ఉన్న మమతా ప్రసాద్ ను ఐటీ అండ్ విఐజి కు బదిలీ చేసింది.
హైదరాబాద్ జేటీసీ ఐటీ అండ్ విఐజి గా ఉన్న రమేష్ ను హైదరాబాద్ జేటీసీగా బదిలీ చేస్తూ ఉత్తర్వులను శనివారం జారీ చేసింది.