హైదరాబాద్ లో విషాదం..చైనా మాంజా మెడకు చుట్టుకుని జవాన్ మృతి
హైద్రాబాద్ లో భోగి పండగ పూట విషాదం నెలకొంది. సంక్రాంతి పండగ సందర్భంగా నగరంలో జనాలు జోరుగా పతంగులు ఎగరవేస్తున్నారు. ఈ క్రమంలో జనవరి 13వ తేదీ శనివారం రాత్రి నగరంలోని లంగర్ హౌజ్ ఫ్లై ఓవర్ పై ప్రమాదం చోటుచసుకుంది.
ఫ్లైఓవర్ పై నుంచి వెళ్తుండగా.. చైనా మాంజా దారం మెడకు చుట్టుకుని ఓ సైనికుడు మృతి చెందాడు.
విశాఖపట్నంకు చెందిన కోటేశ్వేర్ రావు అనే జవాన్ తన విధులు ముగించుకుని బైక్ పై ఇంటికి వెళ్తుండగా లంగర్ హౌస్ వంతెన పై ఓ చైనా మాంజా మెడకు చుట్టుకుని తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆయనను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. అయితే, చికిత్స పొందుతూ జవాన్ చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
హైదరాబాద్ గడిచిన రెండు రోజులల్లోనే పతంగులు ఎగరవేసే క్రమంలో ఐదురుగు ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటికే పోలీసులు చైనా మాంజాను వినియోగించవొద్దని.. వాటిని ఉపయోగిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించినా.. జనాలు మాత్రం పట్టించుకోకుండా పతంగులు ఎగరవేసేందుకు చైనా మాంజాలే వాడుతున్నారు.