
Traffic Restrictions : Mar 20, 2026, రంజాన్ మాసం ఆఖరి శుక్రవారం మక్కా మసీదులో నిర్వహించే ప్రత్యేక ప్రార్థనల కారణంగా, చార్మినార్ పరిసర ప్రాంతాల్లో ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ట్రాఫిక్‌పై ఆంక్షలు ఉంటాయని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. నయాపూల్, నాగుల చింత, శాలిబండ, చౌక్ మైదాన్, మూసాబౌలి, గుల్జార్ హౌస్, మిట్టి కా షేర్, ఏపీఏటీ నుంచి వచ్చే వాహనాలను ప్రత్యామ్నాయ మార్గాల్లో మళ్లిస్తారు. ఈ ఆంక్షలు ఆర్టీసీ బస్సులకు కూడా వర్తిస్తాయి, సిటీ బస్సులు అఫ్ఘల్ గంజ్ వద్ద, జిల్లా బస్సులు చాదర్ ఘాట్, సైదాబాద్, మిధాని మీదుగా మళ్లిస్తారు.

