నేడు “జగనన్న విద్యా దీవెన” పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్
క్రమం తప్పకుండా ఏ త్రైమాసికం ఫీజు ఆ త్రైమాసికం అయిన వెంటనే చెల్లిస్తూ..
జూలై-సెప్టెంబర్, 2023 త్రైమాసికానికి 8,09,039 మంది విద్యార్థులకు లబ్ధి చేకూరుస్తూ రూ. 584 కోట్లను నేడు తల్లులు, విద్యార్థుల జాయింట్ ఖాతాల్లో నేరుగా జమ చేయనున్న సీఎం జగన్ గారు
జగనన్న విద్యా దీవెన క్రింద నేడు అందిస్తున్న రూ.584 కోట్లతో కలిపి ఇప్పటి వరకు విద్యా దీవెన, వసతి దీవెనల క్రింద జగనన్న ప్రభుత్వం చేసిన, చేస్తున్న వ్యయం మొత్తంగా . 18,576 కోట్లు.. ఇది గత ప్రభుత్వం చేసిన వ్యయం కంటే 6,435 కోట్లు అధికం
అధికారంలోకి వచ్చిన ఈ 55 నెలల కాలంలో కేవలం విద్యా రంగ సంస్కరణలపై మన జగనన్న ప్రభుత్వం చేసిన, చేస్తున్న వ్యయం అక్షరాలా రూ.73,417కోట్లు