TRINETHRAM NEWS

చరిత్రలో ఈరోజు ఫిబ్రవరి 02 న

సంఘటనలు

1970: ఆంధ్ర ప్రదేశ్లో ఒంగోలు జిల్లా అవతరణ. తరువాత 1972 డిసెంబర్ 5 వ తేదీన జిల్లా పేరును ప్రకాశం జిల్లాగా మార్చారు.

2011: టెలికాం మంత్రి ఎ. రాజాను 2011 ఫిబ్రవరి 2 నాడు, 2జి స్పెక్త్రుం కేసులో అరెస్టు చేసి తీహారు జైలులో ఉంచారు. 2012 మే 15 నాడు 2జి ట్రయల్ కోర్టు బెయిలు మంజూరు చేసింది.

జననాలు

1863: కాశీభట్ట బ్రహ్మయ్యశాస్త్రి, తెలుగు రచయిత. (మ.1940)

1902: మోటూరి సత్యనారాయణ, దక్షిణ భారతదేశంలో హిందీ వ్యాప్తిచేసిన మహా పండితుడు, స్వాతంత్ర్య సమరయోధులు

1903: గిడుగు లక్ష్మీకాంతమ్మ లక్ష్మీశారద జంటకవయిత్రులలో గిడుగు లక్ష్మీకాంతమ్మ ఒకరు.

1915: కుష్వంత్ సింఘ్, రచయిత.

1925: తిమ్మావజ్జల కోదండ రామయ్య, మూడు వందలకు పైగా సాహిత్య పరిశోధన వ్యాసాలు, పరిశోధన పత్రిక సంపాదకత్వం,

1923 : వెలమాటి రాందాస్ వైద్య శాస్త్రవేత్త. శ్వాస వ్యవస్థ వైద్యులలో అగ్రగణ్యుడు.

1927: ఆంధ్రప్రదేశ్ కు చెందిన ప్రముఖ ఐ.సి.ఎస్. అధికారి సి. ఆర్. కృష్ణస్వామిరావు జననం (మ.2013).

1930: బి. రాధాబాయి ఆనందరావు, భారత పార్లమెంటు సభ్యురాలు.

1940: ఎస్. వి. రామారావు, తెలుగు సినీ రచయిత.

1940: జె.భాగ్యలక్ష్మి, ఇంగ్లీషు, తెలుగు భాషలలో గుర్తింపు పొందిన రచయిత్రి.

1985: శ్రీలంకకు చెందిన క్రికెట్ క్రీడాకారుడు ఉపుల్ తరంగ జననం.

మరణాలు

1916: ఆకొండి వ్యాసమూర్తి శాస్త్రి, కవి, పండితులు.

1922: కోపల్లె హనుమంతరావు, జాతీయ విద్యకై విశేష కృషిన వారు. (జ.1880)

1970: ప్రముఖ బ్రిటీషు తత్త్వవేత్త బెర్ట్రాండ్ రస్సెల్ మరణం (జ.1872).

1978: ప్రముఖ కవి, రచయిత, మొదటి జ్ఞానపీఠ పురస్కార గ్రహీత జీ శంకర కురుప్ మరణం (జ.1901).

2012: అట్లూరి పుండరీకాక్షయ్య, తెలుగు సినిమా నిర్మాత, రచయిత, నటుడు. (జ.1925)

2020: ఎం. నారాయణరెడ్డి, తెలంగాణ తొలితరం ఉద్యమకారుడు, మాజీ పార్లమెంట్ సభ్యుడు, మాజీ శాసనసభ్యుడు. (జ.1931)

2020: కొమ్మారెడ్డి సురేందర్‌రెడ్డి, తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అటవీ, పశుసంవర్ధక శాఖ మంత్రిగా పనిచేశాడు. (జ.1944)

2023: కె.విశ్వనాథ్, తెలుగు సినిమా దర్శకుడు, నటుడు. (జ. 1930)

పండుగలు , జాతీయ దినాలు

వరల్డ్ వెట్‌లాండ్స్ దినోత్సవం (ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవం)

జాతీయ నదీ దినోత్సవం

రుమటాయిడ్ అవేర్‌నెస్ డే