Today in History : చరిత్రలో ఈరోజు డిసెంబర్ 05 న

TRINETHRAM NEWS

Trinethram News : చరిత్రలో ఈరోజు డిసెంబర్ 05 న

సంఘటనలు

1970: ఆంధ్రప్రదేశ్‌లో ఒంగోలు జిల్లా అవతరణ.

1972: ఒంగోలు జిల్లా ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జ్ఞాపకార్ధము ప్రకాశం జిల్లాగా నామకరణము చేయబడింది.

జననాలు

1782: మార్టిన్ వాన్ బురాన్, అమెరికా మాజీ అధ్యక్షుడు (మ.1862).

1886: అర్దెషీర్ ఇరానీ, సినిమా రచయిత, చిత్ర దర్శకుడు, నటుడు, డిస్ట్రిబ్యూటర్, షోమాన్, ఛాయాగ్రహకుడు (మ.1969).

1896: స్వామి జ్ఞానానంద, ఆంధ్రప్రదేశ్ కు చెందిన యోగీశ్వరుడు, అణు భౌతిక శాస్త్రవేత్త (మ.1969).

1901: వాల్ట్ డిస్నీ, అమెరికన్ చలనచిత్ర నిర్మాత, దర్శకుడు, కథా రచయిత, గొంతు కళాకారుడు, చిత్రకారుడు, వ్యాపారవేత్త (మ.1966).

1905: షేక్ అబ్దుల్లా, జమ్ము కాశ్మీర్ రాష్ట్ర మాజీ ప్రధాన మంత్రి (మ.1982)

1940: గులాం అలి, పాకిస్థాన్ కు చెందిన గజల్ గాయకుడు.

1931: చాట్ల శ్రీరాములు, తెలుగు నాటకరంగ నిపుణుడు, సినిమా నటుడు. (మ.2015)

1958: దామోదర రాజనర్సింహ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా పనిచేశాడు.

1960: సారిక,భారతీయ చలనచిత్ర నటి,కమలహాసన్ మొదటి భార్య.

1974 : ప్రముఖ జర్నలిస్టు, ఎన్డీటీవి ఇండియా సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ రవీష్ కుమార్‌ జననం. ప్రతిష్టాత్మక రామన్ మెగసెసే అవార్డుకు 2019 ఆయన ఎంపికయ్యారు.

1992: పాయల్ రాజ్ పుత్ , భారతీయ సినీ నటీ

మరణాలు

1950: శ్రీ అరబిందో, గురు (జ.1872).

2008: కొమ్మినేని శేషగిరిరావు,. తెలుగుసినిమా దర్శకుడు, నటుడు (జ.1939).

2008: మహ్మద్ ఇస్మాయిల్, సాహితీకారుడు (జ.1943).

2013: నెల్సన్ మండేలా, దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు (జ.1918).

2016: జయలలిత, తమిళనాడు ముఖ్యమంత్రి, సినిమానటి (జ.1948).

2020: కమతం రాంరెడ్డి, తెలంగాణకు చెందిన మాజీ శాసనసభ్యుడు, మాజీ మంత్రి. (జ. 1938)

పండుగలు , జాతీయ దినాలు

అంతర్జాతీయ స్వచ్ఛంద దినోత్సవం.

ప్రపంచ నేల దినోత్సవం .

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Today in history on December 05

You cannot copy content of this page

Scroll to Top