జూన్ 27, 2026

WhatsApp Image 2024 01 01 at 5.06.57 PM

TRINETHRAM NEWS

TTD Degree and Junior Lecturer Jobs: తిరుమల తిరుపతి దేవస్థానంలో 78 డిగ్రీ, జూనియర్‌ లెక్చరర్ పోస్టులకు నోటిఫికేషన్‌

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని తిరుపతిలోని తిరుమల తిరుపతి దేవస్థానాలు శాశ్వత ప్రాతిపదికన తితిదే డిగ్రీ కాలేజీలు, ఓరియంటల్ కాలేజీల్లో డిగ్రీ లెక్చరర్లు, తితిదే జూనియర్ కాలేజీల్లో జూనియర్ లెక్చరర్ ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా మొత్తం 78 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సంబంధిత స్పెషలైజేషన్‌లలో డిగ్రీ, పీజీలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. అలాగే హిందూ మతానికి చెందిన వారై ఉండాలి. అభ్యర్ధుల వయోపరిమితి జులై 1, 2023 నాటికి 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు అయిదేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల సడలింపు ఉంటుంది. ఆసక్తి కలిగిన వారు అధికారిక వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. సబ్జెక్టు వారీగా ఖాళీల వివరాలు, అర్హతలు ఇలా..

డిగ్రీ లెక్చరర్ పోస్టులు 49 వరకు ఉన్నాయి. సంబంధిత స్పెషలైజేషన్‌లో కనీసం 55 శాతం మార్కులతో మాస్టర్స్ డిగ్రీలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. అలాగే నెట్‌/ స్లెట్‌లో అర్హత సాధించి ఉండాలి.

సబ్జెక్టుల వారీ ఖాళీలు ఇలా..

బోటనీ పోస్టులు: 3
కెమిస్ట్రీ పోస్టులు: 2
కామర్స్ పోస్టులు: 9
డెయిరీ సైన్స్ పోస్టులు: 1
ఎలక్ట్రానిక్స్ పోస్టులు: 1
ఇంగ్లిష్ పోస్టులు: 8
హిందీ పోస్టులు: 2
హిస్టరీ పోస్టులు: 1
హోమ్ సైన్స్ పోస్టులు: 4
ఫిజికల్ ఎడ్యుకేషన్ పోస్టులు: 2
ఫిజిక్స్ పోస్టులు: 2
పాపులేషన్ స్టడీస్ పోస్టులు: 1
సంస్కృతం పోస్టులు: 1
సంస్కృత వ్యాకరణం పోస్టులు: 1
స్టాటిస్టిక్స్ పోస్టులు: 4
తెలుగు పోస్టులు: 3
జువాలజీ పోస్టులు: 4
జూనియర్ లెక్చరర్ పోస్టులు మొత్తం 29 ఉన్నాయి. కనీసం 55 శాతం మార్కులతో సంబంధిత స్పెషలైజేషన్‌లో మాస్టర్స్‌ డిగ్రీలో ఉత్తీర్ణులై ఉండాలి.

You cannot copy content of this page